Transgenders: ట్రాన్స్ జెండర్స్ చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా?
Viral ( Image Source: Twitter)
Viral News

Transgenders: ట్రాన్స్ జెండర్స్ చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా?.. దాని వెనుకున్న రహస్యం ఇదే!

Transgenders: ట్రాన్స్‌జెండర్స్ వస్తున్నారంటే ముందు వాళ్ళ నుంచి చప్పట్లు వినబడతాయి. భారతదేశంలో వాళ్ళు చప్పట్లు కొట్టడం అనేది ఒక సాంప్రదాయక ఆచారం. అయితే, ఇదొక ఆచారమని మనలో చాలా మందికి తెలీదు. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గుర్తింపు, దృష్టి ఆకర్షణ: చప్పట్లు కొట్టడం ద్వారా ట్రాన్స్‌జెండర్స్ తమ ఉనికిని సమాజంలో స్పష్టంగా తెలియజేస్తారు. ఈ ప్రత్యేకమైన చప్పట్ల శబ్దం (సాధారణంగా రెండు చేతులను వేగంగా, లయబద్ధంగా కొట్టడం) వారిని ఇతరుల నుండి వేరు చేస్తుంది. ఇదొక రకమైన సామాజిక సంకేతం, వారి ఉనికిని ప్రకటించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Also Read: Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

సాంప్రదాయం, సాంస్కృతిక ఆచారం: హిజ్రా సమాజంలో ప్రతి యొక్కరు చప్పట్లు కొడుతుంటారు. ఇది చాలాకాలంగా వారి సంస్కృతిలో భాగంగా ఉంది. ఇక వీళ్ళు ఏదైనా శుభకార్యం జరుగుతుంటే చాలు అక్కడికి వచ్చేసి అందరికీ వినిపించేలా చప్పట్లు గట్టిగా కొడుతుంటారు. వివాహాలు జరిగేటప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. ఈ చప్పట్లు వారి ఆశీర్వాదానికి లేదా ఆకర్షణకు సంకేతంగా ఉంటాయి.

Also Read: Radial Road Project: ఆ 14 గ్రామాల మీదగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు.. నిర్మణ పనులకు నేడు సీఎం శంకుస్థాపన

ఆర్థిక కారణాలు: ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో చాలామంది సాంప్రదాయకంగా ఆశీర్వాదాలు ఇవ్వడం లేదా నృత్యం చేయడం ద్వారా జీవనోపాధి పొందుతారు. చప్పట్లు కొట్టడం ద్వారా వారందర్ని ఆకర్షించి, డబ్బు లేదా బహుమతులు అడిగే అవకాశాన్ని సృష్టించుకుంటారు. ఇలా వారు ఎంతో కొంత డబ్బును పొందుతారు.

Also Read: Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!

సామాజిక ఒత్తిడి, వ్యతిరేకత: కొన్ని సందర్భాల్లో, చప్పట్లు కొట్టడం సమాజంలో కొందరికీ నచ్చదు. ఇలాంటి సమయంలో వారి పై సామాజిక వ్యతిరేకత కనబడుతుంది. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో తరచూ వివక్ష, హింస, అవమానాలను ఎదుర్కొంటారు. చప్పట్లు కొట్టడం ద్వారా వారు తమ గుర్తింపును గట్టిగా ప్రకటించి, తమ ఉనికిని ధైర్యంగా చాటుకుంటారు.

 

Just In

01

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ జర్నీలో ఇమ్మానియేల్ ఫీలింగ్ ఏంటో తెలుసా.. కళ్యాణ్‌, తనూజల మధ్య ఉన్నది ఇదే?

Kotak Bank Downtime: కోటక్ ఖాతాదారులకు కీలక అలర్ట్.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పనిచేయవు.. ఎప్పుడంటే?

Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!

Google Alert: దయచేసి అమెరికా వదిలి వెళ్లకండి.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఎందుకంటే?

Jupally Krishna Rao: తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల అభినందనీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు