Varalaxmi Sarathkumar: తన సోదరితో వరలక్ష్మి సినిమా.. టైటిల్ ఇదే
Varalaxmi Sarathkumar Saraswathi
ఎంటర్‌టైన్‌మెంట్

Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar).. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేశారు. వెర్సటైల్ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న వరలక్ష్మి, ఇప్పుడు తన సోదరి పూజా శరత్ కుమార్‌ (Pooja Sarathkumar)తో కలిసి నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు, దర్శకురాలిగా మెగా ఫోన్ కూడా పట్టబోతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి దోస డైరీస్‌ (Dosa Diaries) బ్యానర్‌ని ప్రారంభించిన ఆమె, ఈ బ్యానర్‌లో చేయబోతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ని కూడా అధికారికంగా వెల్లడించారు.

Also Read- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

నిర్మాత, దర్శకురాలిగా..

నటిగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న వరలక్ష్మి ఇప్పుడు చిత్రనిర్మాణ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి నాంది పలుకుతోంది. సోదరి పూజాతో కలిసి దోస డైరీస్‌ బ్యానర్‌ తొలి చిత్రంగా ‘సరస్వతి’ అనే టైటిల్‌తో.. ఓ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనను శనివారం (సెప్టెంబర్ 27) విడుదల చేశారు. ఈ సినిమాతో వరలక్ష్మి దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటబోతున్నారు. ఆమె దర్శకత్వంలో రాబోతున్న తొలి చిత్ర టైటిల్ ‘సరస్వతి’ (SARASWATHI)ని గమనిస్తే.. ఇంగ్లీష్ లెటర్స్‌లో ‘ఐ’ అనే అక్షరం ఎరుపు రంగులో హైలైట్ చేయబడి, సినిమా ఇంటన్సిటీని తెలియజేస్తోంది. టైటిల్‌తోనే ప్రేక్షకులలో ఈ సినిమాపై క్యురియాసిటీ‌ని పెంచేసిన వరలక్ష్మీ అండ్ టీమ్.. ఇందులో నటించే తారాగణం వివరాలను కూడా తెలిపి మరింత థ్రిల్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే, అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు.

Also Read- Asia Cup 2025 Final: 41 ఏళ్ల తర్వాత పాక్‌తో ఫైనల్స్.. కెప్టెన్ సూర్యకుమార్ షాకింగ్ రియాక్షన్!

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం

హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించనుండగా.. ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రియమణి (Priyamani), నవీన్ చంద్ర (Naveen Chandra) ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం (Thaman S) అందిస్తుండటం. అవును ఈ సినిమాకు టాప్ టెక్నిషియన్స్‌ను వరలక్ష్మి ఫైనల్ చేసుకున్నారు. వారి వివరాలను గమనిస్తే.. సంగీత సంచలనం థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే కెమెరా మ్యాన్‌గా, వెంకట్ రాజేన్ ఎడిటర్‌గా, సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వరలక్ష్మి అండ్ టీమ్ తెలిపింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Lover Attacks Man: రాత్రి 1.30 గంటలకు ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రైవేటు పార్ట్స్ కోసేసిన ప్రియురాలు

BSNL WiFi Calling: మెరుగైన కనెక్టివిటీ కోసం దేశమంతటా BSNL Wi-Fi కాలింగ్ లాంచ్

Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Drive OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఆది పినిశెట్టి ‘డ్రైవ్’..

Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి