Swetcha Effect: దీర్ఘకాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు అధికారులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ‘జైళ్ల శాఖలో ఏం జరుగుతోంది?’ అన్న శీర్షికతో ‘స్వేచ్ఛ’ ఇచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు అధికారులకు సూపరిండింటెంట్లుగా పదోన్నతులతోపాటు పోస్టింగులు కూడా ఇచ్చారు. జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరిండింటెంట్లుగా ఉన్న వెంకటేశ్వర్లు(Venkateswarlu), దశరథం(Dasharatham), భరత్(Bharath), ప్రమోద్(Pramodh)లకు సూపరిండింటెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వడానికి గతేడాది డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు.
సూపరిండింటెంట్ పోస్టు ఖాళీ
ఈ నలుగురికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం పదోన్నతులు ఇవ్వొచ్చని 2025, ఏప్రిల్ 8న డీపీసీ(DCP) సిఫార్సు చేసింది. కాగా, గత సంవత్సరం జూన్‌లో రిటైర్ కానున్న నేపథ్యంలో సిఫార్సు అందిన వెంటనే వెంకటేశ్వర్లుకు ప్రమోషన్ ఇచ్చారు. ఆయన రిటైర్ కూడా అయ్యారు. ఇక, నిజామాబాద్ జైలు సూపరిండింటెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో జాబితాలో ఉన్న దశరథంకు పదోన్నతినిచ్చి అక్కడ నియమించారు. అయితే, భరత్, ప్రమోద్‌లకు మాత్రం ప్రమోషన్లు దక్కలేదు.
Also Read: Political Trolls: హరీశ్ రావు ఎలివేషన్స్‌కు.. సజ్జనార్ బ్రేకులు.. పరువు మెుత్తం పోయిందిగా!
‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం
ఖాళీలు ఉన్నా జైళ్ల శాఖ ఉన్నతాధికారులు డీపీసీ గడువు ముగియటానికి ఒక్క రోజు ముందు వీరికి సంబంధించిన ఫైల్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్దకు పంపించారు. ఈ నెల 5న దానిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫైలుపై సంతకం చేశారు. అయితే, అప్పటికే డీపీసీ గడువు ముగియడంతో భరత్, ప్రమోద్‌లకు ప్రమోషన్లు దక్కకుండా పోయాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ప్రమోద్, భరత్‌లకు ప్రమోషన్లు ఇచ్చింది. చర్లపల్లి జైలుకు సూపరిండింటెంట్‌గా ప్రమోద్‌ను, అగ్రికల్చర్ కాలనీ సూపరిండింటెంట్‌గా భరత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Municipal Elections: మునిసిపల్ ఎన్నికల ముందు నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్

