Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తుది అంకానికి చేరుకుంది. నేటితో సమ్మక్క- సారలమ్మ జాతర ముగియనుండటంతో శనివారం రోజున ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. హైదరాబాద్, వరంగల్ సహా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు.. మేడారం బాట పట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై కొన్ని గంటలపాటు వాహనాల్లో నిరీక్షించాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడింది. దీంతో ప్రయాణికుల కోపం కట్టలు తెంచుకుంటోంది.
బస్సు అద్దాలు ధ్వంసం..
చివరి రోజున లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో తాడ్వాయి – మేడారం మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 8 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు గత 3 రోజులుగా జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకున్న భక్తులు పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణం అవుతుండటం ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. వేలాది వాహనాలు.. రెండున్నర గంటల పాటు తాడ్వాయి – మేడారం రహదారిపై నిలిచిపోయాయి. మరోవైపు జాతర నుంచి స్వస్థలాలకు బయలుదేరిన భక్తులు.. నిరీక్షణ తట్టుకోలేక మేడారం తాత్కాలిక బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.
మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ లో భక్తుల ఆందోళన
తిరుగు ప్రయాణానికి అందుబాటులో ఒక్క బస్సు కూడా లేదని ఆగ్రహం
అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి వేచి ఉన్నామని ఫైర్
రోడ్లపై ఇంకా కంట్రోల్ కు రాని ట్రాఫిక్ జామ్
భక్తుల ఇబ్బందులపై కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం… pic.twitter.com/FckpDLkp3v
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
అధికారులపై ఆగ్రహం
అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మేడారం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి సైతం దిగారు. భక్తుల తిరుగు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ తడకలను ధ్వంసం చేశారు. అయితే తాడ్వాయి – మేడారం మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయిన వెంటనే.. తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
నేటితో ముగియనున్న మేడారం మహాజాతర
చివరి రోజు కావడంతో భక్తులతో జనసంద్రంగా మారిన మేడారం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వెళ్తున్న భక్తులు
అమ్మవార్ల దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు
మేడారంలో ఇవాళ అత్యంత… pic.twitter.com/A6wcpoWf9E
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
Also Read: YSRCP Leader: భార్యతో వివాహేతర బంధం.. వైసీపీ నేతపై భర్త దాడి.. చెప్పు తీసుకొని..
నేటితో జాతర ముగింపు..
జనవరి 28న ప్రారంభమైన మేడారం మహాజాతర ఇవాళ అంటే జనవరి 31వ తేదీన ముగియనుంది. దీంతో గద్దెలపై ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల సాధారణ దర్శనానికి 3-4 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీఐపీ దర్శనానికి గంటపైగా పడుతున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఇవాళ నలుగురు వనదేవతలను తిరిగి వన ప్రవేశం చేయించడం ద్వారా జాతర ముగియనుంది.

