YSRCP Leader: రాజకీయ నేతల వివాహేతర సంబంధాలు.. ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నారా కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణల పర్వం కొనసాగుతున్న క్రమంలోనే.. తాజాగా వైసీపీకి చెందిన నేత కూడా ఓ మహిళతో ఎఫైర్ పెట్టుకొని పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. తన భార్యతో కారులో వెళ్తున్న వైసీపీ నేతను అడ్డగించిన భర్త.. అతడిపై దాడికి తెగబడ్డాడు.
Also Read: Municipal Elections: పురపాలిక పోరులో ముగిసిన నామినేషన్ల స్వీకరణ.. మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చేవి అంటే?
వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్ రెడ్డిపై ఈ దాడి జరిగింది. ఓ మహిళతో మహీంద్రా థార్ కారులో వెళ్తుండగా ఆమె భర్త అడ్డగించి దాడి చేశాడు. చెప్పుతీసుకొని హరిప్రసాద్ ముఖంపై పదే పదే కొట్టాడు. అటు భార్యపై సైతం నడిరోడ్డుపై భర్త దాడికి తెగబడ్డాడు. భార్యతో హరి ప్రసాద్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఆమె భర్త ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే ఈ దాడి ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి
ఓ మహిళతో కారులో వెళ్తుండగా హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేసిన మహిళ భర్త
హరిప్రసాద్ రెడ్డి కారు ధ్వంసం చేసి మహిళను తీసుకెళ్లిన ఆమె భర్త
మహిళకు, హరిప్రసాద్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం
Attack on… pic.twitter.com/lJnhKC4edO
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ గతంలోనూ పలువురు వైసీపీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. అంబటి రాంబాబు సుకన్య కాల్ వ్యవహారం, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కలకలం, విజయ సాయిరెడ్డి – దేవాదయశాఖ ఉద్యోగిని గర్భవతి అంశం ఇలా పలు వివాదాలు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న క్రమంలో.. ఆ పార్టీకే చెందిన నేత ఇలా అక్రమ సంబంధం ఆరోపణలతో సోషల్ మీడియాకు ఎక్కడం వైసీపీని ఇరుకున పెడుతోంది.

