Asia Cup 2025 Final: పాక్‌తో ఫైనల్స్.. సూర్య షాకింగ్ రియాక్షన్
Asia Cup 2025 Final (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Asia Cup 2025 Final: 41 ఏళ్ల తర్వాత పాక్‌తో ఫైనల్స్.. కెప్టెన్ సూర్యకుమార్ షాకింగ్ రియాక్షన్!

Asia Cup 2025 Final: ఆసియా కప్ 2025లో అత్యంత ఉత్కంఠభరిత పోరు ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ – పాక్ జట్లు తొలిసారి ఫైనల్స్ లో తలపబడబోతున్నాయి. సాధారణంగా భారత్ – పాక్ మ్యాచ్ అంటేనే ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. అలాంటిది ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్ లో రెండు జట్లు తలపడుతుండటంతో ఇరు జట్ల అభిమానుల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పాక్ తో ఫైనల్ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్రశ్న ఎదురవ్వగా.. అతడు షాకింగ్ కామెంట్స్ చేశారు.

సూర్య ఏమన్నారంటే?

శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ సూపర్ వరకూ వెళ్లి ఘన విజయం సాధించింది. గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్య కుమార్ కు ఆసియా కప్ ఫైనల్స్ గురించి ప్రశ్న ఎదురైంది. అయితే ఫైనల్ పై పెద్ద ఎత్తున ఏర్పడిన హైప్ ను సూర్యకుమార్ యాదవ్ అస్సలు పట్టించుకోలేదు. ‘ఈరోజు (శనివారం) మంచిగా రికవరీ కావాలి. ఫైనల్‌ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. శ్రీలంకతో మ్యాచ్ లో కొంతమంది ఆటగాళ్లు క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డారు. వారు రికవరీ కావడానికి ఒక రోజు సమయం దొరికింది. ఆ తర్వాత ఫైనల్స్ కూడా నిన్నటిలాగే బరిలోకి దిగుతాం’ అని సూర్య చెప్పారు.

శ్రీలంకపై అద్భుత విజయం

సూపర్‌ ఫోర్‌లో శ్రీలంకపై జరిగిన చివరి మ్యాచ్‌ లో అతి కష్టం మీద విజయం సాధించింది. చివరి మ్యాచ్ లోనూ తేలిగ్గా లంకను మట్టి కరిపిస్తుందని అంతా భావించారు. కానీ 200 పరుగులకు పైగా టార్గెట్ ను కాపాడుకోవడంలో భారత్ బౌలర్లు ఫెయిల్ అయ్యారు. దీంతో ఇరు జట్ల స్కోర్లు టైగా మారడంతో.. మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లారు ఎంపైర్లు. అయితే అర్షదీప్ అద్భుత బౌలింగ్ స్పెల్ వేసి 2 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య, గిల్.. తొలి బంతికే మూడు పరుగులు చేసి టీమ్ కు విజయాన్ని అందించారు.

Also Read: YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్

ఫైనల్లా అనిపించింది: సూర్య

విజయం అనంతరం శ్రీలంకతో మ్యాచ్ గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడారు. ‘ఈ మ్యాచ్‌ ఫైనల్‌లా అనిపించింది. మొదటి ఇన్నింగ్స్‌ తర్వాత కూడా ఆటగాళ్లు అద్భుతమైన ధైర్యాన్ని చూపించారు. ముఖ్యంగా మిడిల్ లో సంజూ, తిలక్‌ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. సంజు ఓపెనర్‌ కాకపోయినా బాధ్యత తీసుకొని ఆడటం, తిలక్‌ ధైర్యంగా రాణించడం సంతోషంగా అనిపించింది’ అని సూర్య అన్నారు. సూపర్ ఓవర్ వేసిన ఆర్షదీప్ గురించి మాట్లాడుతూ సూర్య ప్రశంసలు కురిపించారు. ‘గత 2–3 ఏళ్లుగా అర్ష్‌దీప్‌ ఎప్పుడూ భారత్‌ కోసం కీలక సమయాల్లో నిలిచాడు. అతనికి తన ప్లాన్‌పై నమ్మకం ఉంది. ఒత్తిడిని ఎదుర్కొని బౌలింగ్‌ చేయడం అతనికి అలవాటు. సూపర్‌ ఓవర్‌ లో బౌలింగ్‌ చేయడానికి అతనికన్నా మంచి ఎంపికే లేదు’ అని ప్రశంసించారు.

Also Read: Brazil Couple: కొండ అంచున కారు ఆపి.. రొమాన్స్‌లో మునిగిన జంట.. ఇంతలోనే స్పాట్ డెడ్!

Just In

01

Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ ఏడాది ఎప్పుడంటే?

Amazon Good News: అమెజాన్ కీలక నిర్ణయం… ఇండియన్ టెకీలకు గుడ్‌‌న్యూస్

Pawan Kalyan: రేపు తెలంగాణకు పవన్.. కొండగట్టులో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Xiaomi India Launch: భారత్‌ మార్కెట్లోకి Xiaomi 17, 17 Ultra, 17T.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Medaram Jatara 2026: సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని… కీలక ఆదేశాలు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ