Brazil Couple: కొండ అంచున కారు ఆపి రొమాన్స్‌.. జంట స్పాట్ డెడ్!
Brazil Couple (Image Source: Twitter)
Viral News

Brazil Couple: కొండ అంచున కారు ఆపి.. రొమాన్స్‌లో మునిగిన జంట.. ఇంతలోనే స్పాట్ డెడ్!

Brazil Couple: బ్రెజిల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎత్తైన కొండ ప్రాంతాన్ని వీక్షించేందుకు వెళ్లిన ఓ జంట.. లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. కారును కొండ అంచున పార్క్ చేసి.. అందులో ఆ జంట రొమాన్స్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కుదుపులకు లోనైనా కారు.. ఒక్కసారిగా ముందుకు సాగి లోయపడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువతి, యువకుడు దుర్మరణం చెందినట్లు పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే?

బ్రెజిల్‌లోని వెండా నోవా డో ఇమిగ్రాంటే (Venda Nova do Imigrante) నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నగరానికి సమీపంలో 1300 అడుగుల ఎత్తైన కొండ ఉంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కారులో జరిగిన బలమైన కదలికల కారణంగా వాహనం ముందుకు కదిలి అదుపు తప్పింది. అర్థరాత్రి సుమారు 1 గంట సమయంలో కారు లోయలో పడిపోయిందని చెబుతున్నారు.

నగ్నంగా మృతదేహాలు

దాదాపు 1300 అడుగుల ఎత్తు నుంచి కారు లోయలో పడిపోవడంతో.. అందులోని స్త్రీ, పురుషుడు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో వారి మృతదేహాలు నగ్నంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పురుషుడి వయసు 42 ఏళ్లుగా.. మహిళ వయసు 26 ఏళ్లుగా ఉన్నట్లు పోలీసులు అంచనా వేశారు. స్థానిక పోలీసు అధికారి ఆల్బెర్టో రోక్ పారెస్ మాట్లాడుతూ.. ప్రమాద స్థలంలో ఎలాంటి హింస లేదా గొడవకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పేర్కొన్నారు.

6 నెలలుగా ప్రేమలో ఉన్న జంట

ప్రమాదానికి గురైన కారుకు హ్యాండ్‌ బ్రేక్‌ వేసి ఉన్నట్లు పోలీసు అధికారి ఆల్బెర్టో రోక్ పారెస్ తెలిపారు. కారులో చోటుచేసుకున్న కదిలికల వల్లే వాహనం లోయలోకి పడిపోయి ఉంటుందని తేల్చి చెప్పారు. మృతుడిని మార్కోన్ డా సిల్వా కార్డోసో గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు యంత్రాల ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన యువతి మాచాడా రిబీరో అని.. ఆమె తన తల్లి బేకరిలో పనిచేసేవారని వివరించారు. గత ఆరు నెలలుగా వారిద్దరు రిలేషన్ లో ఉన్నారని.. వారి బంధంలో ఎలాంటి గొడవలు లేవని పోలీసు అధికారి ఆల్బెర్టో చెప్పారు.

Also Read: CM Revanth Reddy: మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది.. వ్యసనాలకు బానిస కావొద్దు.. సీఎం స్వీట్ వార్నింగ్!

అతి కష్టం మీద మృతదేహాలు వెలికితీత

తొలుత మృతదేహాలను ఉదయం 7 గంటల సమయంలో ఒక కార్మికుడు గమనించాడు. కారు దారుణ స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఎత్తైన కొండ నుంచి కిందికి దిగి మృతదేహాలను పైకి తీసుకురావడానికి ఎంతగానో కష్టపడ్డారు. మార్కోన్ మృతదేహం లోయ అంచులో కనిపించగా అడ్రియానా మృతదేహం అంతకంటే లోతైన ప్రదేశంలో కనిపించింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఈ ఘటనను ఒక దురదృష్టకర ప్రమాదంగా పరిగణిస్తున్నారు.

Also Read: VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

Just In

01

PhD on Nifty 50: నిఫ్టీ-50పై పీహెచ్‌డీ.. డాక్టరేట్ సాధించిన తెలుగు వ్యక్తి

Oppo Find X9s: 7,000mAh బ్యాటరీతో Oppo Find X9s..

Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్

Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం.. మధ్యప్రదేశ్‌లో 200 చిలుకల మృతి

Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ ఏడాది ఎప్పుడంటే?