CM Revanth Reddy (Image Source: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది.. వ్యసనాలకు బానిస కావొద్దు.. సీఎం స్వీట్ వార్నింగ్!

CM Revanth Reddy: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదట 1956లో ఐటీఐలను ప్రారంభమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదని సీఎం అభిప్రాయపడ్డారు.

65 ఏటీసీలు ప్రారంభం.. మరో 51 మంజూరు

కోర్సులను అప్ గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘మేం అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని ఆలోచన చేశాం. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేశాం. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. సాధించలేనిది ఏదీ లేదు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనం. రాష్ట్రంలో 65 ఎటీసీలను పూర్తి చేశాం. ఇవాళ మరో 51 ఏటీసీలను మంజూరు చేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘చదువు ఒక్కటే మీ తలరాత మారుస్తుంది’

ఏడాదిలోగా 51 ఏటీసీల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవు. యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యంగా అందించాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాంకేతిక నైపుణ్యంపై ఫోకస్ పెట్టండి… జర్మనీ, జపాన్ లు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోండి’ అని యువతకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

ప్రతీ నెలా రూ.2 వేల స్కాలర్ షిప్?

డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘వ్యసనాలకు బానిస కాకకండి. తల్లిదండ్రులకు బాధను మిగల్చకండి. ఏటీసీలలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రంటీస్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సూచిస్తున్నా. ఏటీసీలలో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్ షిప్ అందిచేలా ఆర్ధిక మంత్రిని ఒప్పించి ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ సోదరుడిగా మీ భవిష్యత్ కోసం మేం ప్రణాళికలు వేస్తున్నాం. మన యువతకు జపనీస్ నేర్పి అక్కడ ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉంది. మనిషికి తెలివి, పని చేసే కమిట్మెంట్ ఉంటే చాలు. ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. మీ భవిష్యత్ కు పునాదులు వేస్తాం’ అంటూ యువతకు సీఎం భరోసా కల్పించారు.

Also Read: Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!

Just In

01

Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు

OG villain Jimmy viral: ‘ఓజీ’ విలన్ చేసిన పనికి నవ్వుతున్న జనం.. ఎందుకంటే?

Crime News: మధ్యప్రదేశ్‌లో దారుణం.. కన్నతల్లిముందు ఐదేళ్ల బాలుడి హత్య

Kothagudem Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎస్పీ కీలక సూచనలు

OTT Movie: ప్రతీ ప్రేమకథ నిజంతో మొదలవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం..