Notices to KCR: పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) శుక్రవారం కీలక పరిణామం జరిగింది. కేసు దర్యాప్తు చేపడుతున్న సిట్ అధికారులు మరోసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (Notices to KCR) నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ కోరిన విధంగానే మరో విచారణ తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 1న అంటే, ఆదివారం నాడు విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని వివరించారు. అయితే, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో విచారణ జరపాలనే విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. అయితే, ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో ప్రశ్నిస్తామని తెలియజేశారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.
Read Also- Bhatti Vikramarka: మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల వార్షికోత్సవాల్లో భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు..?
కేసీఆర్ వస్తారా?
కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలని కోరగా, సిట్ అధికారులు అందుకు నిరాకరించడం నోటీసుల ద్వారా స్పష్టమైంది. నందినగర్ నివాసంలో విచారణకు పోలీసులు మొగ్గు చూపడం వెనుక కారణాలు ఏంటనేది తెలియరాలేదు. ఒకవేళ కేసీఆర్ అంగీకరించకపోతే, చట్టపరమైన తదుపరి చర్యలు ఉంటాయనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు.
క్లైమాక్స్‌కు కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంతో ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1న విచారణ నిర్ణయించడంతో, తదుపరి పరిణామాలు ఏవిధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also- MLA Kaushik Reddy: సమ్మక్క జాతరలో ఓవరాక్షన్.. పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ సంఘం సీరియస్
ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది తేల్చడమే లక్ష్యంగా సిట్ విచారణ కొనసాగుతోంది. దీంతో, కేసీఆర్‌కు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకానున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సమాచారం సీఎం కార్యాలయానికి అందిందా? అని ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఈ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తదితరుల వాంగ్మూలాలను నమోదు చేయగా, వాటిని కేసీఆర్ ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంది. కేసీఆర్ విచారణ ఒకే రోజు ఉంటుందా?, కేవలం ప్రశ్నించే వరకే పరిమితం అవుతారా?, ఇంకేమైనా పరిణామాలు ఉంటాయనే అంశాలు కూడా బీఆర్ఎస్, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

