Bhatti Vikramarka: వార్షికోత్సవాల్లో భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు
Bhatti Vikramarka (imagecrerdit:swetcha)
Telangana News

Bhatti Vikramarka: మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల వార్షికోత్సవాల్లో భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు..?

Bhatti Vikramarka: చరిత్ర కలిగిన మొగిలిగిద్ద గ్రామంలోని ఉన్నత పాఠశాల ఎంతో మంది మేదావులకు నిలయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్(Bhatti Vikramark)​ అన్నారు. షాద్​నగర్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapally Shanbkar)​ అధ్యక్షతన ఫారూక్నగర్​ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని స్కూల్ 150వ వార్షికొత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని అనే నానుడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకు అవసరమైన నిధులను కేటాయించి విద్యార్ధులకు మెరుగైన విద్యనందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఆర్ధికంగా అనుకూలిస్తే ఉచితంగా అల్పాహారం విద్యార్ధులకు అందిస్తామన్నారు.

నియోజకవర్గానికి ఒకటి..

విద్యార్ధులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి యేడాది పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రభుత్వ స్కూల్స్​ను ఎంపిక చేసి కామన్​ విద్యా విధానం అమలుకు శ్రీకారం చూడుతున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కులం, మతం, ఆర్ధిక తారతామ్యాలు లేకుండా నాణ్యమైన విద్యా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్​ నియోజకవర్గానికి ఒకటి చోప్పున ఏర్పాటుకు శంఘస్ధాపనలు చేశామన్నారు. ప్రతి స్కూల్ ఏరియా 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200కోట్ల బడ్జెట్తో రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో రూ.20వేల కోట్ల వ్యయంతో ప్రారంభించామన్నారు. ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటి పడాలంటే మొరుగైన ఆర్ధిక వనరులు అవసరమని తెలిపారు. ఆర్ధిక వనరులు బలపడితే అందరికి ఉచిత విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

సీఎం చోరవతో రూ.10కోట్లు కేటాయింపు..

గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద గ్రామంలోని హైస్కూల్​కు రూ.10కోట్లు ఆధునిక విద్యాభివృద్ధికి కేటాయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్​ అన్నారు. స్కూల్ యజమాన్యం వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎంకి ఆహ్వానం పలికారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి స్కూల్కు హాజరై విద్యార్ధులతో మాట్లాడి స్ధానిక సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారంతో పాటు ఆధునిక విద్యకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు నిధులు కేటాయించారని తెలిపారు. గత పాలకులు ఈ గ్రామాన్ని దతత్త తీసుకోని అభివృద్ధ ఇచేస్తామని చెప్పి గాలీకి వదిలేశారని అన్నారు. ఐఐటీలను అనాధలుగా వదిలేసిన చర్రిత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదని ఆరోపించారు. ఉపాధికి అనుగుణంగా విద్యార్ధి విద్యా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తిస్ధాయిలో సిలబస్ మార్చేసిందన్నారు. విద్యతో పాటు ఉపాధికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఆధునిక యంత్రాలను, పరికరాలను అందుబాటులోకి తీసుకోస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టల్స్లో ఉండే విద్యార్ధుల పరిస్థితులను పరిశీలించామన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి 15 రోజుల్లో డైట్, కాస్క్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్ధులకు అందిచామన్నారు.

Also Read: Medigadda Barrage: అత్యధిక ప్రమాదకర జాబితాలో మేడిగడ్డ.. తక్షణ జోక్యం అవసరం అంటూ కేంద్రం హెచ్చరిక..!

రూ.20వేల కోట్లు వడ్డి లేని రుణాలు

నగరానికి నాలుగు వైపులు ఆధునిక హంగులతో మల్టీస్పెషాలిటి ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందన్నారు. వీటితో పాటు జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ అసుపత్రులను అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ ఆసుపత్రుల అభివృద్ధితో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వం భావిస్తోందన్నారు. మహిళాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు మొదటి ఏడాదియే రూ.20వేల కోట్లు వడ్డి లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటికి సాధ్యమైనంత మేరకు పేదల అభివృద్ధికి పనిచేసే అవకాశం కల్పించింది ముందుతరం నాయకులన్నారు. హైదరాబాద్​ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఫ్రోఫెసర్​ హరగోపాల్​ వంటి మేదావులను ఈ గడ్డకు అందించిన చరిత్ర మొగిలిగిద్ద స్కూల్​కే దక్కిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఒక వైపు… రాజు దైవంశ సంభూతుడు అన్న భావన మరో వైపు జరుగుతున్న సమయంలో బూర్గుల రామకృష్ణారావు నిజాం వ్యతిరేకంగా గ్రంథాలయాల ఉద్యమాలు నడిపించారని బట్టి గుర్తు చేశారు.

దేనికైన చరిత్రయే కొలమానం

రాష్ట్రంలో ప్రతిష్టాత్మమైన సమ్మక్క సారక్క జాతర జరుగుతుండగా మొగిలిగిద్దం గ్రామంలోని హైస్కూల్కు రావడం సంతోషంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam PRabhakar) అన్నారు. ప్రోఫెసర్​ హరగోపాల్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరగిందన్నారు. ప్రభుత్వాలకైనా, సంస్థలకైన చరిత్రయే కొలమానంగా ఉంటుందన్నారు. ఆచరిత్ర మీదనే వర్తమానం, భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులపై భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్దంగా అడుగులు వేస్తోందన్నారు. ప్రయివేట్​, కార్పోరేట్ స్కూల్స్​లో చదివే విద్యార్దులకు ఫీజులు భారమైతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ స్కూల్స్​ లోనే సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పోన్నం ప్రభాకర్​ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బండారి సంతోష జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Aslo Read: Medaram Jatara: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?