YSRCP (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్

YSRCP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై శాసనసభలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ (Kamineni Srinivas) వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మేల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినే విరూపాక్షి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరడం ఏ మాత్రం సరికాదని తేల్చి చెప్పారు. అసందర్భంగా ఆ అంశాన్ని ప్రస్తావించి సభలో లేని జగన్‌ గురించి కామినేని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. అందుకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైసీపీ తరుపున ఎమ్మెల్యేలు కోరారు.

‘సినీ ప్రముఖులను నిర్లక్ష్యం చేయలేదు’

ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వాటిపై దుమారం రేగడంతో మాట మార్చడం కూటమి ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి, శివప్రసాద్‌రెడ్డి అన్నారు. నిజానికి సినీ ప్రముఖులు తనని కలిసినప్పుడు అప్పటి సీఎం జగన్‌ (YS Jagan Mohan Reddy) వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించి చాలా గౌరవంగా మాట్లాడారని అన్నారు. వారి పట్ల ఎక్కడా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపలేదని, వారిని అవమానపర్చలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాజాగా కూడా చిరంజీవి (Chiranjeevi) కూడా వెల్లడించారని గుర్తుచేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా జగన్‌ ని నిందిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘బహిరంగ క్షమాపణ చెప్పాలి’

దురుద్దేశంతో జగన్‌గారిని నిందించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇప్పుడు చాలా అమాయకంగా తన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరడం అసమంజసమని, అందుకు బదులుగా ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినే విరూపాక్షి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తాజా ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Also Read: Ind Vs Pak Final: ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, పాండ్యా ఆడడం లేదా?.. కోచ్ షాకింగ్ అప్‌డేట్

బాలయ్య కామెంట్స్ పైనా.. 

మరోవైపు మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీ సాక్షిగా సైకో అని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంభోదించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు, హామీల అమలు గురించి మాట్లాడాలి తప్ప.. ఆ మాటలేంటి బాలకృష్ణ? అంటూ నిలదీస్తున్నారు. ‘చిరంజీవితో సమస్య ఉంటే మీలో మీరే చూసుకోవాలి. అంతే తప్ప వైయస్ జగన్ ను మధ్యలోకి తెచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని స్పష్టం చేస్తున్నారు. జగన్ పై బాలయ్య చేసిన మాటలు ఆయన మానసిక స్థితికి అద్దపడుతున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు కళ్లతో కాకుండా ఇకనైనా మీ కళ్లతో చూడాలని హితవు పలికారు.

Also Read: Crime News: మధ్యప్రదేశ్‌లో దారుణం.. కన్నతల్లిముందు ఐదేళ్ల బాలుడి హత్య

Just In

01

The Face of The Faceless: 123 అవార్డులు పొంది, ఆస్కార్‌కు నామినేటైన సినిమా తెలుగులో.. రిలీజ్ ఎప్పుడంటే?

Tollywood: రాఘవేంద్రరావు – నిహారిక.. ఎందుకింత రచ్చ? అందులో ఏముందని?

Ram Gopal Varma: ‘శివ’ సైకిల్ చేజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌కు 35 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన వర్మ! ఆ పాప ఇప్పుడెలా ఉందంటే?

Samantha: న్యూ చాప్ట‌ర్ బిగిన్స్.. సమంత పోస్ట్‌కి అర్థమేంటో తెలుసా?

Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి