Kotak Bank Downtime: దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహింద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) తన ఖాతాదారులకు కీలకమైన సూచన చేసింది. ఆదివారం నాడు (డిసెంబర్ 31) తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య కీలకమైన కొన్ని సేవలు పనిచేయవని అప్రమత్తం చేసింది. ఖాతాదారులకు నిరంతరాయమైన సేవలు అందించే లక్ష్యంతో, బ్యాంకింగ్స్ సిస్టమ్స్‌లో కీలకమైన యాక్టివిటీ జరపాల్సి ఉన్నదని, ఈ డౌన్‌టైమ్‌లో (Kotak Bank Downtime) అంతరాయం కలుగుతుందని వివరించింది. షెడ్యూల్డ్ మెయింటనెన్స్ కారణంగా గంటపాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది.
ఈ సర్వీసులు అందుబాటులో ఉండవ్..
మెయింటనెన్స్ కారణంగా అందుబాటులో ఉండని సర్వీసులను కోటక్ మహింద్రా బ్యాంక్ వెల్లడించింది. ఈ జాబితాలో, కోటక్ బ్యాంక్ యాప్ (ఓల్డ్), న్యూకోటక్ బ్యాంక్ యాప్, కోటక్811 మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఇతర పేమెంట్ సంబంధిత సేవలు పనిచేయవని స్పష్టంగా తెలిపింది. అలాగే, ఏటీఎం సేవలపై కూడా పాక్షిక ప్రభావం ఉంటుందని, రూ.20 వేల కంటే తక్కువ నగదును విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించింది. కాబట్టి, ఖాతాదారులు ముందుగానే సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని కోటక్ బ్యాంక్ సూచన చేసింది.
Read Also- Jupally Krishna Rao: తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల అభినందనీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు
డౌన్ టైమ్ అంటే?
బ్యాంకింగ్, టెక్నాలజీ రంగంలో ఒక సిస్టమ్, సర్వర్ లేదా నెట్‌వర్క్ పనిచేయకుండా ఆగిపోయిన సమయాన్ని డౌన్ టైమ్ (Downtime) అని పిలుస్తారు. ఈ సమయంలో యూజర్లు సంబంధిత సేవలను పొందలేరు. బ్యాంకింగ్ రంగంలో ఈ డౌన్ టైమ్ రెండు రకాలుగా ఉంటుంది. షెడ్యూల్డ్ డౌన్ టైమ్ (Planned) విధానంలో తన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి, లేదా మెయింటెనెన్స్ కోసం ముందుగానే సమయాన్ని నిర్ణయిస్తుంది. దీని గురించి వినియోగదారులకు ముందే సమాచారం అందిస్తారు. కోటక్ మహింద్రా బ్యాంక్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది ఈ రకమైన డౌన్‌టైమే.
ఇక, రెండవది, అన్-షెడ్యూల్డ్ డౌన్ టైమ్ (Unplanned). ఇది సాధారణంగా సాంకేతిక లోపాలు, సైబర్ దాడులు, లేదా సర్వర్ ఫెయిల్యూర్ కారణంగా అకస్మాత్తుగా సేవలు ఆగిపోయిన సందర్భాల్లో చేపడుతుంటారు. ఇలాంటి సమయాల్లో కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. లావాదేవీలలో అంతరాయం ఏర్పడుతుంది. కొన్నిసార్లు సెంట్రల్ సర్వర్ డౌన్ అయితే ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేయడం కూడా సాధ్యమవ్వదు. ఎప్పుడుపడితే అప్పుడు డౌన్ టైమ్ ఏర్పడితే ఖాతాదారులు ఇబ్బందులు పడడంతో పాటు బ్యాంకులపై కస్టమర్లకు నమ్మకం పోతుందని, అందుకే బ్యాంకులు తమ ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టంగా ఉంచుకోవాలని ఆర్బీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు కఠినమైన నిబంధనలను కూడా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Read Also- Sreenivasan Death: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత.. మోహన్ లాల్‌తో అద్భుత ప్రయాణం..

