February 1 New Rules: ఫిబ్రవరి 1 నుంచి అమలయ్యే రూల్స్ ఇవే
New rules coming into effect from February 1 impacting common people in India
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

February 1 New Rules: ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే.. ఎవరిపై ప్రభావం ఉంటుందంటే?

February 1 New Rules: ఆర్థికపరమైన, పరిపాలనా పరమైన సౌలభ్యాలే లక్ష్యంగా ప్రభుత్వం, లేదా కంపెనీలు ఎప్పటికప్పుడు అవసరం మేరకు మార్పులు చేస్తుంటాయి. ఈ రూల్స్‌ను అర్ధాంతరంగా కాకుండా, సాధారణంగా 1వ తేదీ నుంచి అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఈ మేరకు ముందస్తుగానే సమాచారం ఇస్తుంటాయి. 2026 ఫిబ్రవరి నెలలో కొత్త అమలు కానున్న నిబంధనలను (February 1 New Rules) కూడా ఆయా ఫైనాన్షియల్ సంస్థలు
సమీక్షించనున్నాయి. ఈ జాబితాలో పన్నులు, గ్యాస్ సిలిండర్ రేట్లు, స్టాక్ మార్కెట్, రైతుల వరకు సామాన్యుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే పల కీలక మార్పులు ఆచరణలోకి రాబోతున్నాయి.

బడ్జెట్ వచ్చేస్తోంది

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు ఇది వరుసగా తొమ్మిదవ బడ్జెట్, కాగా, బడ్జెట్ ప్రకటనలు ఎలా ఉంటాయి?, వివిధ వర్గాలను ఏవిధంగా ప్రభావితం చేస్తాయనేది వేచిచూడాలి. ముఖ్యంగా, ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితులను ఇంకేమైనా సడలిస్తారా?, పాత, కొత్త పన్ను విధానాల్లో మార్పులు ఉంటాయా అనే వాటికోసం ప్రజలు బడ్జెట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు.

Read Also- Medaram Jatara: ఓరినాయానా.. మేడారంలో కిక్కిరిసి పోతున్న జనం.. భక్తుల లైన్లు చూస్తే కళ్లు చెదరాల్సిందే..!

ఫాస్టాగ్‌కు అదనపు కేవైసీ అక్కర్లేదు

ఫిబ్రవరి 1 నుంచి ఫాస్టాగ్‌కు సంబంధించి చిన్న మార్పు చోటుచేసుకోబోతోంది. ఫాస్టాగ్‌కు సంబంధించిన కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఎన్‌హెచ్ఏఐ ప్రకటించింది. ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత అదనపు కేవైసీ వెరిఫికేషన్ అవసరం ఉండదని, ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.

బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు

సాధారణంగా శనివారం, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు. కానీ, బడ్జెట్ 2026-27 సమర్పించనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1 (ఆదివారం) నాడు కూడా స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయి. రెగ్యులర్ సమయాలు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు యథావిధిగా పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెగ్యులేటర్స్ ఇప్పటికే ప్రకటించాయి. ఉదయం 11 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి, ఆ సమయంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండడం మంచిది.

Read Also- Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మరోమారు సిట్ నోటీసులు!

గ్యాస్ ధరలు మారతాయా?

చమురు రంగ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధన ధరలను సమీక్షిస్తుంటాయి. కాబట్టి, ఫిబ్రవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించే అవకాశం ఉంది. గృహ వినియోగ గ్యాస్ కాకపోయినా, కమర్షియల్ గ్యాస్ ధరలు మార్పునకు గురయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, ఫిబ్రవరి 1న సీఎన్‌జీ, పీఎన్‌జీ, విమాన ఇంధనం అయిన ఏటీఎఫ్ ధరలు కూడా మారే అవకాశం ఉంది.

సిగరెట్ రేట్లు పెరుగుతాయా?

ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, వీటిపై ప్రభుత్వం జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌లతో పాటు అదనంగా హెల్త్, నేషనల్ సెక్యూరిటీ పన్నులను విధించే యోచనలో ఉన్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే, ఈ ఉత్పత్తుల రేట్లు మరింత ఖరీదైనవిగా మారిపోవడం ఖాయం.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?