Croma Republic Day Sale: ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ రిటైల్ చైన్ ‘క్రోమా’ (Croma Retail) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. జనవరి 23నే ప్రారంభమైన ఈ సేల్ జనవరి 26 వరకు (Croma Republic Day Sale) కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు భారీ ఆఫర్లు పొందవచ్చు. హోమ్ అప్లయన్సెస్, వంటగదిలో వినియోగించే ప్రొడక్ట్స్, స్మార్ట్ఫోన్లు, యాపిల్ డివైజులపై కూడా డిస్కౌంట్లు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లు అన్నింటిలోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
యాపిల్ ప్రొడక్ట్స్ 10 శాతం వరకు..
రిపబ్లిక్ సేల్‌లో భాగంగా యాపిల్ ప్రొడక్ట్స్‌పై అదనంగా 10 శాతం వరకు సేవింగ్స్ చేసుకోవచ్చని కస్టమర్లకు తెలిపింది. హెచ్డీఎఫ్సీ టాటా న్యూ కార్డ్ వినియోగించే కస్టమర్లకు ఎంపిక చేసిన ప్రొడక్టులపై ఈ డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. ఈ సేల్‌లో ధర తగ్గింపులుతో పాటు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, స్టూడెంట్ ప్రైసింగ్, ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయని క్రోమా వివరించింది. అయితే, ఫైనల్ రేటు మాత్రం ప్రొడక్ట్, విక్రయించే సిటీ, స్టోర్, బ్యాంక్ భాగస్వామి ఆధారంగా మారవచ్చని సూచించింది.
Read Also- VD14 Movie: విజయ్ దేవరకొండ ‘VD14’ టైటిల్‌తో రెడీ అయ్యాడు.. ఎప్పుడంటే?
ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై క్రోమా ఆఫర్లను కూడా ప్రకటించింది. ఒప్పో రెనో 15 ఫోన్‌ను రూ.21,399కి వస్తుందని తెలిపింది. ఆఫర్లో భాగంగా రూ.3,999 విలువ చేసే ఒప్పో ఎంకో బడ్స్ 3 ప్రో ప్లస్‌ను ఫ్రీగా ఇస్తామని తెలిపింది. ఒప్పో రెనో 14 ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.20,000 వరకు వ్యాల్యూతో పాటు రూ.4,600 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని వివరించింది. ఇక, సామ్సంగ్ గెలాక్సీ ఏ56 ఫోన్‌ను రూ.28,499కి దక్కించుకోవచ్చని తెలిపింది. ఈ రేటులో గెలాక్సీ ఏ55 ఎక్స్చేంజ్పై రూ.13,500 వరకు వ్యాల్యూ, రూ.2,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని తెలిపింది.
టీవీలు, హోమ్ అప్లయన్సెస్‌పై కూడా..
హోం అప్లయెన్సెస్‌పై మాత్రమే కాదు, ప్రీమియం టీవీలపై క్రోమా భారీ ధర తగ్గింపులు ప్రకటించింది. రూ.1,75,000 ఉన్న సామ్సంగ్ నియో క్యూ ఎల్ఈడీ 65 ఇంచ్‌ల టీవీని డిస్కౌంట్లో రూ.94,990 నుంచి అందుబాటులో ఉంటుందని వివరించింది. టీసీఎల్ 55 ఇంచ్‌ల క్యూ ఎల్ఈడీ టీవీపై కూడా భారీ తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఈ టీవీ రేటు రూ.98,990 నుంచి రూ.36,990కి తగ్గుతుందని, ఆఫర్లను బట్టి ఉంటుందని తెలిపింది. ఇక, ఎల్జీ 55 ఇంచెస్ 4కే క్యూనెడ్ మినీ ఎల్ఈడి టీవీ అసలు రేటు రూ.1,10,590 ఉండగా, రూ.61,626కి లభిస్తుందని తెలిపింది. ఎల్జీ సౌండ్బార్లపై 30 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయని క్రోమా వివరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆఫర్లు కొనసాగుతున్నాయి.
కిచెన్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, సొంత బ్రాండ్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. 300 లీటర్లకు పైగా కెపాసిటీ ఉన్న మోడల్ ధర గతంలో సుమారుగా రూ.48,000 వరకు ఉండగా, ఆఫర్లో రూ.29,490కి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Read Also- Srinath Maganti: హిట్ సినిమా సీక్వెల్లో ఛాన్స్ కొట్టేసిన శ్రీనాథ్ మాగంటి.. ఎలా వచ్చిందంటే?

