Gold Rate Increased: సంక్రాంతి పండుగ వేళ పసిడి ధరలు బిగ్ షాక్ ఇచ్చాయి. ఇవాళ (జనవరి 10) బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై ఏకంగా రూ.1150 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1050 మేర ప్రియం అయ్యింది. దీంతో పండుగ వేళ బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఇది పెద్ద షాకే అని చెప్పాలి. మరోవైపు వెండి సైతం కేజీకి ఏకంగా రూ.11,000 పెరిగింది.
దేశవ్యాప్తంగా పసిడి ధరలు..
పెరిగిన ధరల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,40,061కి పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,20,890 పలుకుతోంది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,30,965కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిని రూ.1,20,900కి విక్రయిస్తున్నారు. బెంగళూరులో రూ.1,40,046 (24K), రూ.1,20,875 (22K) చేరగా.. కోల్ కతాలో రూ.1,40,046 (24K), రూ.1,20,875 (22K) విక్రయిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం రూ.1,40,460 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిని రూ.1,28,750 విక్రయిస్తున్నారు. అటు విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని రూ.1,40,046 అమ్ముతున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిని రూ. 1,20,875 సేల్ చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నంలోనూ విజయవాడలో ఉన్న ధరలే అందుబాటులో ఉన్నాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రికార్డు స్థాయిలో రూ.11 వేలు పెరిగింది. ఫలితంగా దేశంలో కిలో వెండి ధర రూ. 2,60,000కి ఎగబాకింది. శుక్రవారం వరకూ ఈ ధర రూ. 2,49,000 ఉండటం గమనార్హం. ఇటు హైదరాబాద్ లో కిలో వెండి ప్రస్తుతం రూ.2,75,000కు విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లోనూ కేజీ వెండి రూ. 2,75,000 పలుకుతోంది.
Also Read: Telangana Secretariat: ఇష్టారాజ్యంగా స్ట్రీట్ వెండర్ల కార్యకలాపాలు.. సదరు నేతకు ఓ కేంద్ర మంత్రి అండ దండలు.. ఎవరా నేత?
ధరల పెరుగుదలకు కారణాలు..
బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న సంగతి తెలసిందే. ట్రంప్ టారిఫ్ బెదిరింపులు, అమెరికా – వెనిజులా ఉద్రిక్తతలు, ఇరాన్ అంతర్యుద్ధం, భౌగౌళిక వాణిజ్య అనిశ్ఛితులు… లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల రిత్యా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకునేందుకు బంగారం, వెండిలాంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

