Jupally Krishna Rao: తొలిసారిగా గోర్ బంజారా చరిత్ర నవలరూపంలో రావడం శుభపరిణామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖామత్రి జూపల్లి కృష్ణారావు(Jupaly Krishna Rao) అన్నారు. శనివారం హైదరాబాద్(Hyderabad) రవీంద్రభారతిలోని మంత్రి చాంబర్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
పాలమూరు జిల్లా తీవ్రకరువు, ఆకలి, వలసలు, పోరాటయోధులకు పుట్టినిల్లు అని, అటువంటి సామాజిక పరిస్థితులు, దోపిడీ నుండి పుట్టుకొచ్చిన వీరవనిత హీరిబాయి(Hiribai) సాహస జీవితాన్ని అత్యద్భుతంగా రచయిత వెంకట్ పవార్ కండ్ల (Venkat Pavar Kandla)ముందు ఉంచారన్నారు. ఆరున్నర అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బలం, అందమైనరూపం, ధైర్యసాహసాలు కలిగిన హీరిబాయి తన పోరాట, వాదపటిమల ద్వారా పాలకులను ఎదిరించి తన జాతి ప్రజల ఆకలిని తీర్చిందన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ(Indhira Gandhi) ప్రభుత్వం ద్వారా జాతి సమస్యలను ఏకరువు పెట్టి అభివృద్ధికి బాటలు వేసుకున్నదన్నారు.
Also Read: Rajagopal Reddy: మంత్రి పదవిపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమీ
తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల పోర్యతార(Gor Banjara historical novel Poryatara) ద్వారా అస్తిత్వ సాహిత్య చరిత్రలో ఒక కొత్త బాట వేసినందుకు రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్(Aam Goth Venkat Pawar) ను, సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించి సమాజానికి అందించిన సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారిలను అభినందించారు. వెంకట్ పవార్ వేసిన ఈ బాటెంట మరింత మంది గోర్ బంజారా కవులు, రచయితలు నడచి మరిన్ని నూతన రచనలు చేయాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మైన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్(Bellayya Naik), తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి(Balachare), నవలా రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి కమిటీ సబ్యులు ముచ్చర్ల దినకర్, రచయిత సహచరి అనూషాబాయి పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్.. ఎవరో తెలుసా..?

