Viral Video: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు అంజనేశ్ వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చను లేవనెత్తింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఏడాది జరిగిన అత్యంత చర్చనీయాంశమైన ఈవెంట్లలో ఒకటిగా ఎమ్మెల్యే కుమారుడి వివాహం మారిపోయింది. పెళ్లి వేడుకలు జరిగిన తీరు, ఆర్భాటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒక ఎమ్మెల్యే కుమారుడి వివాహం ఈ స్థాయిలో జరగడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
హిందూ దేవతల విగ్రహాలు
వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తే పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అతిథులు, రాజకీయ ప్రముఖులు వెడ్డింగ్ కు హాజరయ్యారు. ఓ వీడియోలో కేవలం బాణాసంచా కోసమే రూ.70 లక్షలు ఖర్చు అయినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇక సంప్రదాయ వెడ్డింగ్ వేదికలకు భిన్నంగా ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి వేదికను సిద్ధం చేశారు. ప్రాంగణం అంతటా హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై భారీ శివుడి విగ్రహాన్ని పెట్టారు. ఆయన ముందు నూతన వధూవరులు దండలు మార్చుకొనగా.. శివుడి వెనక భాగంలో పెద్ద ఎత్తున తారా జువ్వలు ఎగసిపడటం వైరల్ వీడియోల్లో హైలెట్ గా నిలుస్తోంది.
Indore MLA Golu Shukla’s son Anjanesh Shukla tied the knot in a grand wedding ceremony that drew widespread attention.
At the varmala event, the celebration featured an extravagant fireworks display reportedly costing around ₹70 lakh, lighting up the sky and captivating… pic.twitter.com/qyXVqE377w
— Hashtag Cinema (@hashtagcinema_) December 14, 2025
ఖరీదైన పెళ్లి వస్త్రాలు
అటు పెళ్లి రోజున అంజనేశ్ ఖరీదైన షెర్వాణీ ధరించగా.. వధువు సిమర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వధువు ధరించిన దుస్తులను ప్రముఖ డిజైనర్లు రింపుల్ & హర్ ప్రీత్ రూపొందించడం విశేషం. మరోవైపు ఇండోర్‌లోని ఖజురానా ఆలయంలో మూల విరాట్ ముందు వధూవరులు పూల దండలు మార్చుకున్న వీడియో ఒకటి కూడా వైరల్ అవుతోంది. సాధారణంగా ఆ ఆలయంలో మూల విరాట్ వద్దకు సాధారణ భక్తులను అనుమతించరని.. కనీసం ఫొటోలు – వీడియోలు కూడా నిషిద్దమని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలను అంజనేశ్ సోదరుడు రుద్రాక్ష్ శుక్లా షేర్ చేశారు.
Wedding of BJP MLA Golu Shukla's son.
70 lakhs spent just on the fire-works !
And we fools are letting go of our income.
Our kids will curse us for giving away their share for the families of public servants !
Demand #AbolishIncomeTax !pic.twitter.com/gs25R1aFEs
— Indian Tax Payer (@indtxpyr) December 15, 2025
Also Read: UN Security Council: స్నేహంతో సింధూ నీరు ఇస్తే.. యుద్ధాలు, ఉగ్రదాడులు తిరిగిచ్చింది.. పాక్‌పై భారత్ ఫైర్
నెటిజన్లు మండిపాటు
అయితే ఈ పెళ్లి వేడుకపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బాణాసంచాకే రూ.70 లక్షలు ఖర్చు చేస్తే.. ఇక పెళ్లికి ఎన్ని రూ. కోట్లు ఖర్చు చేసుంటారో అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రజా ధనాన్ని దోచుకొని ఇలా కుమారుడి పెళ్లిని గ్రాండ్ గా సదరు ఎమ్మెల్యే చేశారని ఆరోపిస్తున్నారు. అయితే సాధారణ చిరు వ్యాపారులను పట్టిపీడించే ఆదాయపన్ను శాఖ అధికారులు.. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఓ యూజర్ ప్రశ్నించారు. కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఎమ్మెల్యే కుటుంబం ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ వివాహానికి బీజేపీతో పాటు కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

