UN Security Council: ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన భారత్
UN Security Council (Image Source: Twitter)
జాతీయం

UN Security Council: స్నేహంతో సింధూ నీరు ఇస్తే.. యుద్ధాలు, ఉగ్రదాడులు తిరిగిచ్చింది.. పాక్‌పై భారత్ ఫైర్

UN Security Council: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో మరోమారు జమ్ము కాశ్మీర్ అంశాన్ని తీసుకొచ్చింది. అసందర్భంగా కాశ్మీర్ విషయాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని పాకిస్థాన్ ను సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో రగులుతున్న ఇమ్రాన్ ఖాన్ వివాదం, సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ఐరాస వేదికగా ఆ దేశం పరువు తీశారు.

‘కశ్మీర్‌తో విడదీయరాని బంధం’

జమ్ముకాశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతం భారత్ లో అంతర్భాగమని మరోమారు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఐరాస భద్రతామండలిలో తేల్చి చెప్పారు. ఆ రెండు భూభాగాలతో భారత్ కు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. గతం, ప్రస్తుతం, భవిష్యత్ ఇలా ఎప్పటికీ అవి భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. మరోవైపు సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నిలిపివేత గురించి కూడా ఆయన ఐరాసలో మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి పాక్ కేంద్రబిందువుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

’10 వేలకు పైగా భారతీయులు మృతి’

65 ఏళ్ల క్రితం నమ్మకం, స్నేహభావంతో పాక్ తో సింధూ జలాల ఒప్పందానికి భారత్ అంగీకరించిందని హరీశ్ పర్వతనేని గుర్తుచేశారు. భారత్ స్నేహపూర్వంగా నీరు అందిస్తే అందుకు ప్రతిఫలంగా ఈ ఆరు దశాబ్దాల్లో పాక్ తమకు మూడు యుద్ధాలు, వందలాది ఉగ్రదాడులను తిరిగి ఇచ్చిందని చెప్పారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. గత 4 దశాబ్దాల కాలంలో పాక్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 10వేలకు పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాసలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

Also Read: Panchayat Election: ఉత్కంఠగా పంచాయతీ ఎన్నికలు.. ఒక్క ఓటుతో అభ్యర్థుల గెలుపు!

ఆ విషయంలో పాక్ స్పెషల్

అదే సమయంలో పాకిస్థాన్ లోని ప్రజాస్వామ్య పరిస్థితులపైనా పర్వతనేని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో పెట్టడం, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)ను నిషేధించడం, అలాగే 27వ సవరణ ద్వారా సైన్యాధిపతి అసీమ్ మునీర్‌కు జీవితకాల రక్షణ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ (constitutional coup) చేయడం గురించి ఆయన ఐరాసలో ప్రస్తావించారు. ‘ప్రజల విశ్వాసాలను గౌరవించే విధానం పాక్ లో చాలా ప్రత్యేకమైనది. ఒక ప్రధానిని జైలులో పెట్టడం, అధికార పార్టీని నిషేధించడం, సైన్యం రాజ్యాంగాన్ని మార్చుకుని తన అధిపతికి జీవితకాల రక్షణ కల్పించడం’ అని పర్వతనేని విమర్శించారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో అన్ని విధాలుగా భారత్ తన పూర్తి శక్తితో ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు.

Also Read: WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Just In

01

IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… రూ.25.20 కోట్లు పలికిన విదేశీ ప్లేయర్

Viral video: చట్టసభలో ఉద్రిక్తత.. జుట్లు పట్టుకొని.. పొట్టు పొట్టుకొట్టుకున్న మహిళా ఎంపీలు

Chikiri Song: సునామీ సృష్టిస్తోన్న ‘చికిరి చికిరి’.. తెలుగులో సరికొత్త రికార్డ్!

Telangana Pocso Cases: పసిమొగ్గలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు.. గడిచిన ఐదేళ్లలో 16,994 పోక్సో కేసులు నమొదు.. శిక్షపడింది..!

VB G RAM G Bill: ఈ పేర్లు మార్చే పిచ్చేంటి?.. లోక్‌సభలో కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్