Chain Snatching: కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం
Chain Snatching (imagecredit:swetcha)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Chain Snatching: ఆదివారం ఉదయం దౌల్తాబాద్(Daulatabad) మండల పరిధిలోని కోనాపూర్(Konapur) గ్రామ శివారులో చైన్ స్నాచింగ్(Chain snatching) ఘటన కలకలం రేపింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్తున్న ఓ మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తేల తాడును గుర్తుతెలియని దుండగుడు లాకెళ్లాడు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం పల్సర్ బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమెను బెదిరించి పుస్తేల తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.

Also Read: Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

చుట్టుపక్కల రైతులు

ఘటన జరిగిన వెంటనే మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు చేరుకుని సమాచారం పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న తోగుట సీఐ లతీఫ్(CI Latif), దౌల్తాబాద్ ఎస్సై గంగాధర అరుణ్‌కుమార్(SI Gangadhara Arun Kumar) ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దుండగుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Also Read: Labour Codes: కొత్త లేబర్ కోడ్స్‌పై స్పష్టత.. పీఎఫ్ కట్ పెరుగుతుందా? టేక్-హోమ్ జీతం తగ్గుతుందన్న భయాలపై కేంద్రం క్లారిటీ

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం