Hyderabad Crime: మీర్​ చౌక్​ లో అక్క తమ్ముడు మృతి
Hyderabad Crime ( image credit: twitter)
క్రైమ్, హైదరాబాద్

Hyderabad Crime: మీర్​ చౌక్​ లో అక్క తమ్ముడు మృతి.. ఇద్దరూ ఒకే సమయంలో ఎలా చనిపోయారు?

Hyderabad Crime: అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కా తమ్ముడు చనిపోయారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన మీర్​ చౌక్​ పోలీస్ (Police) ​ స్టేషన్​ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్​ పుర నూర్​ ఖాన్​ బజార్ వాస్తవ్యురాలైన సర్వరీ బేగం (90) వికలాంగురాలు. ఆమె తమ్ముడు షకీల్ (80). ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. వికలాంగురాలైన అక్క బాగోగులు చూసుకుంటున్న షకీల్ ఆమెతో కలిసి నలభై ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాడు.

Also Read: Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

ఈ ఇద్దరు సహజంగా చనిపోయారా?

కాగా,  వాళ్లు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఇద్దరు సహజంగా చనిపోయారా? ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?