Hyderabad Crime: పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు
Hyderabad Crime (Image credit: twitter)
క్రైమ్, హైదరాబాద్

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

Hyderabad Crime:  హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోని నాచారం (Nacharam) పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ వేళ అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తు, క్షణికావేశం తోడైతే మనిషి ఎంతటి ఘోరానికైనా ఒడిగడతారని ఈ సంఘటన నిరూపించింది. కేవలం ఒక మద్యం గ్లాసు కోసం తలెత్తిన చిన్న వివాదం, ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకోగా, మరో యువకుడిని కటకటాల పాలు చేసింది. బాధితుడు స్టీఫెర్డ్ రోహన్ సాయర్స్ 30  నిందితుడు లేనర్డ్ లయనెల్ సాయర్స్ (28) వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు కావడంతో, అందరూ వేడుకల్లో ఉండగా, ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి మద్యం సేవించాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తమ నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం మేడపైకి వెళ్లి మద్యం సేవించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

Also Read: Hyderabad Crime: తరుచూ ఫోన్‌ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి

వివాదానికి దారితీసిన కారణం ఇదే

మద్యం సేవించే క్రమంలో ఒకే ఒక్క గ్లాసు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. తమ్ముడిని గ్లాసు ఇవ్వమని అన్న అడగడంతో మొదలైన చిన్న మాట, మద్యం మత్తులో పెద్ద గొడవగా మారింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు లయనెల్ సాయర్స్, తన అన్న అని కూడా చూడకుండా రోహన్‌ను భవనం పైనుంచి బలంగా కిందకు తోసేశాడు. మూడవ అంతస్తు నుండి ఒక్కసారిగా కింద పడటంతో రోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. భారీ శబ్దం రావడంతో స్థానికులు పరుగున వచ్చి గమనించగా, రక్తపు మడుగులో పడి ఉన్న రోహన్ కనిపించాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే రోహన్ పరిస్థితి విషమించి మరణించాడు. పండుగ పూట ఇంట్లో వెలుగులు నిండాల్సిన సమయంలో, ఈ మరణంతో ఆ కుటుంబంలో అంధకారం అలుముకుంది.

నిందితుడిపై కేసు నమోదు

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న నాచారం పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, కేవలం ఐదు గంటల వ్యవధిలోనే లయనెల్ సాయర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి విచారించి ఈ ఘటన ఆధారాలు సేకరించారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పండుగ పూట అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ గొడవ ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.

Also Read: Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!

Just In

01

Euphoria Movie: గుణ శేఖర్ ‘యుఫోరియా’ ట్రైలర్ డేట్ ఫిక్స్..వచ్చేది ఎప్పుడంటే?

Ponguleti Srinivasa Reddy: ఆ తేదిన పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి .. రూ. 362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!

Kattalan: ‘కటాలన్’ సెకండ్ లుక్ వచ్చేసింది.. ఊర మాస్ అవతార్‌!

Miracle First Look: సంక్రాంతి కానుకగా ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!