Hyderabad Crime: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ద్వారకా నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లయోలా డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రుతిక (19) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం, రుతిక తరచూ మొబైల్ ఫోన్ వినియోగిస్తుండటంతో ఆమె తల్లి మందలించినట్లు తెలుస్తోంది.
Also Read: Crime News: భార్య కొడుకును కిరాతకంగా హత్య చేసి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రుతిక, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: Hyderabad Crime: తరుచూ ఫోన్ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి

