Crime News: భార్య కొడుకును కిరాతకంగా హత్య చేసి భర్త
Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: భార్య కొడుకును కిరాతకంగా హత్య చేసి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Crime News: కట్టుకున్న భార్య.. కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా హత్య చేసిన వ్యక్తి ఆ తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా కొల్లూరు ప్రాంతంలోని జేపీనగర్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆడుకుంగటున్న బాలుడు

జేపీనగర్ లో నివాసముంటున్న చంద్రకళ (30), శివరాజ్ భార్యాభర్తలు. వీరి కుమారుడు రేవంత్ (14). ఇటీవలే శివరాజ్ భార్య, కుమారునితో కలిసి జేపీనగర్ వచ్చి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కాగా, గురువారం వీరి ఇంటి పక్కనే ఉంటున్న కుటుంబంలోని బాలుడు ఆడుకోవటానిని రేవంత్​ ను పిలిచేందుకు ఇంట్లోకి వెళ్లాడు. చూడగా శివరాజ్ గొంతు నుంచి రక్తం కారుతూ కనిపించింది.

Also Read: Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..

భార్య, కొడుకును చంపి..

భయపడ్డ బాలుడు పరుగున వెళ్లి ఇంట్లో వారికి విషయం చెప్పాడు. దాంతో స్థానికులు వచ్చి చూడగా శివరాజ్​(Shivaraj) స్పృహ తప్పి కనిపించాడు. బెడ్ రూంలో చంద్రకళ(Chendhrakala), రేవంత్(Revanth) చనిపోయి అగుపించారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే కొల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. చనిపోయిన చంద్రకళ, రేవంత్ ల మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం తరలించారు. శివరాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. శివరాజ్ తన భార్య, కొడుకును చంపి ఆ తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని భావిస్తున్నారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: Panchayat Election: ఖర్చులు పక్కాగా చూపాల్సిందే.. ఈ రూల్ తెలుసా?, లేదా?

Just In

01

GHMC: అక్రమ అనుమతులు..అడ్డదారిలో ఓసీలు.. 27 సర్కిళ్లలో వెలుగులోకి సంచలనాలు..!

RajaSaab Pre Release: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?.. ఎప్పుడంటే?

Kamareddy district: భార్యపై వేధింపులు.. కామాంధుడ్ని చెప్పుతో కొడుతూ.. రోడ్డుపై ఊరేగించిన భర్త

Fake Job Scam: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి దందా.. !

Bigg Boss9: ‘ఇమ్మూన్యుల్ ఒక వెదవ.. ఎంత చెప్పినా వినలేదు’.. తనూజ షాకింగ్ కామెంట్స్