Hyderabad Crime: ప్రేమించినవాడు అనుమానించాడని వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో ప్రియుడిపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ఐశ్వర్య (19)కు సూర్యాపేట జిల్లాకు చెందిన మహేశ్ అలియాస్ ఆనంద్ (23)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. అయితే ఐశ్వర్య ప్రస్తుతం హైదరాబాద్ నాగోలులోని తట్టి అన్నారం ప్రాంతంలో నివసిస్తోంది. మరోవైపు ఆనంద్ సైతం నగరంలోని హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు.
ఐశ్వర్యపై అనుమానం
గత కొన్నిరోజులుగా ఐశ్వర్య తరుచూ ఫోన్ లో మాట్లాడుతుండటంపై ఆనంద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 5వ తేదీన ఇదే విషయంపై ఐశ్వర్యను నిలదీశాడు. ఎవరితో మాట్లాడుతున్నావంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం కోపంగా ఆనంద్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
Also Read: 500% tariff on India: భారత్‌పై 500 శాతం టారిఫ్.. బిగ్ బాంబ్ పేల్చిన డొనాల్డ్ ట్రంప్!
ఐశ్వర్య ఆత్మహత్య..
కట్టుకోబోయే వాడే తనపై అనుమాన పడటంతో ఐశ్వర్య మానసికంగా కుంగిపోయింది. తీవ్ర ఒత్తిడికి గురైంది. అవమాన భారం భరించలేక తట్టి అన్నారం హౌసింగ్ బోర్డులో గల వాటర్ ట్యాంక్ మీదకు ఎక్కింది. అక్కడ నుంచి అమాంతం కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం ప్రాణాలు విడిచింది. దీంతో ఐశ్వర్య కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన ఆనంద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించినవాడు అనుమానించాడని.. వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి సూసైడ్
ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ఐశ్వర్య(19)కు సూర్యాపేట జిల్లాకు చెందిన మహేశ్ అలియాస్ ఆనంద్ (23)తో పరిచయం
పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల సమ్మతితో వివాహానికి సిద్ధం
హైదరాబాద్ నగరంలోని… pic.twitter.com/30R036qwy6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026

