Swetcha Effect: పాలనాపరమైన విధులలో ఉన్న ఉపాధ్యాయులను తిరిగి బోధనా బాధ్యతలకు కేటాయిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్వేచ్ఛ’ పత్రికలో నవంబర్ 10వ తేదీన ప్రచురించబడిన “డిప్యూటేషన్ దందా” కథనంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఈ చర్యల ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్య పరిష్కారమై, బోధన-ఉపాధ్యాయుల మధ్య బంధం మరింత బలోపేతం అయింది.
Also Read: Ram Gopal Varma: వర్మ తనలోని ఇంకొకడ్ని తీశాడయ్యో.. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ న్యూ అవతార్!
గణిత ఉపాధ్యాయుల కొరత
ఎంఈఓ కార్యాలయంలో ఆపరేటర్(Operator)గా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్(School Assistant) (మ్యాథ్స్) గోపాల్ రెడ్డి(Gopall Reddy)ని పరిపాలన విధులనుండి తప్పించి, బోధన కోసం జెడ్.పి.హెచ్.ఎస్. రాంపూర్ పాఠశాల(Z.P.H.S. Rampur School)కు డిప్యూటేషన్ పై కేటాయించారు. అదేవిధంగా, గణిత ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న యుపిఎస్ కాట్రపల్లికి జడ్పిహెచ్ఎస్ పెద్ద పాపయ్య పల్లెలో ఎక్స్ప్రెస్ గా ఉన్న శ్రీమతి శ్రీదేవి (స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్)ను కేటాయించడం జరిగింది. ఈ చర్యలు అక్రమ డిప్యూటేషన్లకు ముగింపు పలికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఒక శుభ పరిణామాన్ని సూచిస్తున్నాయి. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mahabubabad News: మహబూబాబాద్ రైల్వే మెగా డిపో తరలింపులో భారీ కుట్ర ఉంది: మహ్మద్ ఫరీద్

