Huzurabad Hockey Players: జాతీయ హాకీ బరిలో విద్యార్థులు
Huzurabad Hockey Players (imagecredit:swetcha)
Telangana News, కరీంనగర్

Huzurabad Hockey Players: జాతీయ హాకీ బరిలో హుజురాబాద్‌ విద్యార్థులు ఎంపిక..?

Huzurabad Hockey Players: హుజురాబాద్‌ గడ్డపై హాకీ స్టిక్‌ పట్టిన యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్(Karimnagar) జిల్లా హుజురాబాద్‌కు చెందిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై ఈ ప్రాంత కీర్తిని దశదిశలా చాటారు. ఇటీవల వనపర్తి జిల్లాలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, సెలెక్టర్ల మనసు గెలుచుకున్న ఈ క్రీడాకారులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున జాతీయ వేదికపై పోరాడనున్నారు.

ఈ నెల 27 నుండి..

ఎంపికైన వారిలో ఏకశిలా సిబిఎస్సీ పాఠశాల(Ekasila CBSE School) పదవ తరగతి విద్యార్థిని నిమ్మటూరి లవణీ ప్రియ(Lavani Priya), ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాల(Alforce Genius School) తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఈ. రిషిక(Rishika), వివేకవర్ధిని పాఠశాల(Vivekavardhini School) ఎనిమిదవ తరగతి విద్యార్థి సాదుల అభినయ్(Abhinai), మరియు కరీంనగర్ సోషల్ వెల్ఫేర్ సైనిక్ పాఠశాల(Social Welfare Sainik School) తొమ్మిదవ తరగతి విద్యార్థి కే. చరణ్(K Cheran) ఉన్నారు. ఈ నెల 27 నుండి జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి హాకీ టోర్నీలో వీరు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పట్టుదలే వీరిని ఈ స్థాయికి చేర్చాయని క్రీడా పండితులు కొనియాడుతున్నారు.

Alson Read: Bandi Sanjay: సింగరేణి అక్రమాలు, దోపిడీకి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్!

రాంచీలో జరిగే పోటీల్లో..

హుజురాబాద్ ప్రాంతం నుంచి ఒకేసారి నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికవ్వడం పట్ల స్థానిక హుజురాబాద్ హాకీ క్లబ్(Huzurabad Hockey Club) ప్రతినిధులు మరియు సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా అభినందించారు. అభినందించిన వారిలో క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ తిరుపతి, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉమామహేశ్వర్ తదితరులు ఉన్నారు. వీరు రాంచీలో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచి, రాష్ట్రానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని పట్టణ ప్రముఖులు మరియు వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఆకాంక్షించారు.

Also Read: Dad Kills Daughter: 50 వరకు అంకెలు చెప్పలేదని నాలుగేళ్ల కూతుర్ని కడతేర్చాడు.. ఎలాగంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?