Sarpanch Elections: స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల పోరులో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, చదువుకున్న యువతకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిండు గర్భిణి బోయ తిరుపతమ్మ తిమ్మప్ప 23 హామీలతో ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్ పై హామీలను రాసిచ్చిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
సొంత ఖర్చులతో ఉన్నత విద్య
నేతివానిపల్లి గ్రామంలో సర్పంచిగా గెలిచిన వారంలోపే గ్రామంలో తాగునీటి సమస్య ఉండడంతో నూతన బోరు వేసి గ్రామానికి తాగునీరు అందజేస్తామన్నారు. విద్య వైద్య అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామ పెద్దలు, మేధావులు, యువకులు వారి సూచనలు సలహాలతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తానన్నారు. పూర్తిగా చదువులో వెనుకబడిన వారికి వారి సొంత ఖర్చులతో ఉన్నత విద్య కోసం కృషి చేస్తానని, గురుకుల ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత మెటీరియల్ అందజేస్తామన్నారు. గ్రామంలో వృద్ధులకు,వికలాంగులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందజేస్తామన్నారు.
Also Read: Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
గ్రామ కమిటీ ఆధ్వర్యంలో
గ్రామానికి వెళ్లే రహదారిరోడ్డు పనులుమరమ్మతులు చేయించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గ్రామంలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామని, గ్రామంలో ఉన్న దేవాలయం ధ్వజస్తంభ ఏర్పాటు చేసి, దుర్గామాత, ఆలయ కాంపౌండ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి ఏటా గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించి మహనీయుల పేర్ల మీదగా రైతులకు మరియు విద్యార్థులకు ఉత్తమ అవార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
23 హామీలలో అభివృద్ధి పనులు
ప్రజలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలను నేరుగా నిరుపేదలకు అందేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేసి, గ్రామ పరిపాలనలో భాగంగా మౌలిక వసతులు సమకూర్చడానికి తమ వంతు బాధ్యత నిర్వహిస్తానన్నారు. ఇచ్చిన 23 హామీలలో అభివృద్ధి పనులు నెరవేర్చని యెడల తమ పదవికి స్వయంగా తానే రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా నేతివానిపల్లి(Nethivanipalli) గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిండు గర్భిణి బోయ తిరుపతమ్మ(Tirupatamma) తిమ్మప్(Thimmappa)ప గ్రామ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
Also Read: Messi Hyderabad Visit: కోల్‌కత్తా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్.. మెస్సీ కోసం భారీ భద్రత

