Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. 104వ రోజుకు సంబంధించిన తాజా ప్రోమో, ప్రేక్షకులకి పండగ లాంటి అనుభూతిని మిగిల్చింది. వంద రోజులకు పైగా సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. చివరకు అయిదుగురు మాత్రమే మిగిలారు అయితే వారిలో కూడా టైటిల్ విన్నర్ అవ్వడానికి అందరూ తెగ కష్టపడుతున్నారు. 104 రోజుకు సంబంధించి నాలుగో ప్రోమో విడుదలైంది. ఇందులో శ్రీముఖీ ప్రదీప్ లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. హౌస్ సభ్యులతో సరదాగా గడిపారు. ఇదే తరుణంలో ఇమ్మానియేల్ ను శ్రీముఖి అడిగిన ప్రశ్నలను హెలోరియస్ గా అనిపించాయి. అందులో శ్రీ ముఖి.. ఇమ్మానియేల్ నువ్వు హౌస్ లోకి వచ్చినపుడు మిగిలిన వారిని చూసి ఎలా ఫీల్ అయ్యావు అని అడగ్గా.. ముందుగా చీరకట్టుకుని వచ్చిన సంజన గారిని చూసి మూడో వారంలో అవుట్ అవుతుంది అనుకున్నా.. కళ్యాణ్ ను చూసి ఆరోవారంలో అవుట్ అవుతాడు అనుకున్నా.. మరి నీ గురించి ఏం అనుకున్నావు అని అడగ్గా నేను టాప్ ఫైవ్ లో ఉంటా కదన్నా అంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడ అంతా నవ్వులుమయం అయింది.
Read also-Bharani- Suman Shetty: పవన్ కళ్యాణ్ పాటకు భరణి సుమన్ శెట్టి డాన్స్ చూశారా.. ఇరగదీశారుగా..
సంజన గురించి ఇమ్మూ మరింత చెబుతూ.. పెళ్లిళ్లకు మనం టెంట్ ఒకటి వేస్తాం. అందులో నాలుగు వైపులా నాలుగు కర్రలు ఉంటే ఆ నలుగురూ మేమో మధ్యలో ఒక కర్ర ఉంటుంది అదే సంజన గారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సంజన ఒక్క సారిగా ఎమోషన్ అయ్యారు. ఆ తర్వాత ఇమ్మానియేల్ పవన్ గురించి కూడా కొన్ని మాటలు చాలా ఉత్సాహం కలిగించాయి. డీమాన్ ఒక కల్మషం లేని మనిషి ఇతని చుట్టూ ఉన్న స్నేహితులు చాలా అద్రుష్టవంతులు.. అంటూ డీమాన్ గురించి చెప్పుకొచ్చారు. తర్వాత సంజన వంతు వచ్చింది. ఈ బిగ్ బాస్ షో సందర్భంగా నాకు ఒక కొడుకు దొరికాడు వాడిని నేను దత్తత తీసుకుంటున్నాను అంటూ ఇమ్మానియేల్ గురించి చెప్పుకొచ్చారు. తర్వాత కళ్యాన్ ఇదే ప్రశ్న అడగ్గా తను ఇలా గేమ్ ఆడటానికి కారణం తనూజ అంటూ ఆమె లేకపోతే నేను అసలు లేను అంటూ చెప్పుకొచ్చారు. చివరిగా తనూజ ఇదే విషయాన్ని చెప్పుకొస్తూ.. కళ్యాణ్ లాంటి కొడుకు ప్రతి ఇంట్లో ఉండాలన్నారు. దీంతో తనూజకు పవన్ పై ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోతుంది. ఫనల్ గా అందరూ కలిసి బిగ్ బాస్ కేకును కొశారు. అయితే ఈ రోజు ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. రెపు విన్నర్ ఎవరు అన్నది తెలుస్తుంది. విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Sreenivasan Death: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత.. మోహన్ లాల్‌తో అద్భుత ప్రయాణం..

