Bharani- Suman Shetty: బిగ్ బాస్ సీజన్ 9నుంచి చివరిగా బయటకు వచ్చిన ఇద్దరు స్నేహితులు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదలై మంచి హిట్ సాధించిన ‘దేఖలేంగే సాలా’ పాటకు వారు స్టెప్పులేశారు. ఇంతకూ వారు ఎవరంటే?.. భరణి, సుమన్ శెట్టి. మంచి జోరు మీద ఉన్న వీరిద్దరూ.. ఇప్పుడు పవర్ స్టార్ పాటకు స్టెప్పులేస్తూ.. కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ముందే వచ్చినందుకు సంబరాల చేసుకుంటున్నారా? లేకపోతే విన్నర్ ఎవరో తెలిసి సంబరాలు చేసుకుంటున్నారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ అయిన నటుడు భరణి, సుమన్ శెట్టిలు పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 22 సెకన్ల క్లిప్‌ని ఉపయోగించి, షో ఫినాలే షూటింగ్ ఆలస్యం అనే పుకార్లపై అలాంటిది ఏదీ లేదు అని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌రన్నర్ కళ్యాణ్ పడాల ఇటీవల టాస్క్‌లో తలకు గాయం కావడంతో వచ్చిన ఫ్యాన్ బజ్‌కు లింక్ అవుతోంది, అయినా ఫినాలే డిసెంబర్ 21, 2025నే షెడ్యూల్‌లో ఉంది. ఇది టాప్ 5 రేస్‌కు ఎక్సైట్‌మెంట్‌ను కొనసాగిస్తోంది.
Read also-Sreenivasan Death: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత.. మోహన్ లాల్‌తో అద్భుత ప్రయాణం..
When the Final gets Delayed . 🫶🏻👓#DekhlengeSaala #ustadbhagatsingh #Bharanishankar #saarkar @UBSTheFilm @harish2you @ThisIsDSP @PawanKalyan @TrendPSPK @PawanismNetwork pic.twitter.com/xpUT3yTXNN
— Actor Bharani (@actor_bharanii) December 20, 2025

