Farmer Death: దౌల్తాబాద్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దౌల్తాబాద్(Daulatabad)మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య(Ellayya) అనే రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఎల్లయ్య(Ellayya) (50) కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలానికి నీరు అందించేందుకు మోటార్ స్టాటర్ డబ్బాను తీస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగి షాక్ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఎల్లం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?
ఘటనపై కేసు నమోదు
ఈ ఘటనను గమనించిన పొలాల వద్ద ఉన్న రైతులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్లయ్య మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయ పనుల సమయంలో విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

