Jupally Krishna Rao: హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలను నిర్వహించాలని సూచించారు. జిల్లాకు రూ. 10 లక్షల నిధులు కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.సమాజంలో విలువలు పెంపొందించే విధంగా లైబ్రరీల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, పుస్తకాల కొనుగోలుకు కోటి రూపాయాలు మంజూరు చేస్తాం అన్నారు. ప్రతీ ఇల్లు ఒక లైబ్రరీ గా మారాలని సూచించారు. పుస్తక పఠనం పెంపొందించేలా ప్రతీ ఒక్కరు భాధ్యత తీసుకోవాలని సూచించారు.
Also Read: Jupally Krishna Rao: పర్యాటక రంగంలో 40 వేల మందికి ఉద్యోగాలు.. రూ.7,045 కోట్ల పెట్టుబడులు
367 స్టాల్స్ ఏర్పాటు
సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని,విలువలను పెంపొందించడానికి రచయితలు, సాహితీవేత్తలు, రచయితలు పూనుకోవాలని కోరారు. ప్రజాకవి అందెశ్రీ పేరును 38వ బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి నామకరణం చేశారు. అనిశెట్టి రజిత పేరును ప్రధాన వేదికకు, సాహితీవేత్త కొంపల్లి వెంకట్‌గౌడ్ పేరును పుస్తకావిష్కరణల వేదికకు పెట్టారు. ప్రొఫెసర్ ఎస్‌వీ రామారావు పేరుతో రైటర్స్‌స్టాల్, స్వేచ్ఛ ఒటార్కర్ పేరుతో మీడియా స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో మొత్తం 367 స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఆరు స్ట్లాట్స్‌లో పుస్తకావిష్కరణలు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. మొత్తం 54 పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రొ. కోదండరాం, రామచంద్రమూర్తి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, డా. ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. రియాజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు డా. కవి యాకూబ్, కార్యదర్శి ఆర్. శ్రీనివాసు (వాసు), ఉపాధ్యక్షులు, కందాడి బాల్ రెడ్డి, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు దినకర్, మంత్రి జూపల్లి కృష్ణారావుతదితరులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

