India vs South Africa: నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పడింది
India-Vs-South-Africa (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?

India vs South Africa: భారత్ – దక్షిణాఫ్రికా జట్ల (India vs South Africa) 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌‌లో నిర్ణయాత్మక మ్యాచ్ షురూ అయింది. అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో 5వ టీ20 మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్‌‌కు సంబంధించిన టాస్ అప్‌డేట్ వచ్చింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు ఇవే

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్ ‌కీపర్), హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), డీవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెర్రెరా, జార్జ్ లిండే, మార్కో యన్సెన్, కార్బిన్ బోష్, లుంగి ఎంగిడి, ఓట్నెయిల్ బార్ట్‌మాన్.

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ ‌కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

Read Also- RTC Bus Accident: బస్సు రన్నింగ్‌లో ఫెయిల్ అయిన బ్రేకులు.. పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!

సంజూ శాంసన్‌కు చోటు

టీమిండియాలో ఒక కీలక మార్పు జరిగింది. లక్నో మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో, అతడి స్థానంలో సంజూ శాంసన్‌ బరిలోకి దిగాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. అలాగే, ఈ మ్యాచ్ తుది జట్టులో బుమ్రా, వాషింగ్టన్ సుందర్ కూడా చోటు దక్కింది. టాస్ గెలిస్తే, మొదట బ్యాటింగ్ చేయాలని తాము భావించామని సూర్య చెప్పాడు. వికెట్ చూస్తుంటే బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, ఇక్కడ మంచు ప్రభావం అంతగా కనిపించలేదని అన్నాడు. కాబట్టి ఈ పిచ్‌పై భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాలు విసరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ఒత్తిడి ఎలా ఉన్నా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడి మ్యాచ్‌ను ఆస్వాదించడం చాలా ముఖ్యమని అన్నాడు. జట్టులో కొన్ని మార్పులు చేశామని, హర్షిత్ రాణా స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో సంజూ శాంసన్ తుది జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు.

Read Also- Sewage Dumping Case: సెప్టిక్​ ట్యాంకర్​ ఘ‌ట‌న‌పై జ‌ల‌మండ‌లి సీరీయస్.. డ్రైవర్, ఓనర్‌పై క్రిమినల్ కేసులు!

దక్షిణాఫ్రికా టీమ్‌లో ఒకే మార్పు

దక్షిణాఫ్రికా తుది జట్టులో కూడా ఒక మార్పు జరిగింది. నోర్ట్జే స్థానంలో జార్జ్ లిండేను జట్టులోకి తీసుకొచ్చారు. టాస్ సందర్భంగా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ మాట్లాడుతూ, రాత్రి సమయంలో మంచు ప్రభావం మరింత పెరిగిపోతుందని, అందుకు, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని వివరించాడు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.

Just In

01

Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..

KTR: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమయ్యాయి: కేటీఆర్

Leopard in Naravaripalli: నారావారిపల్లెలో చిరుత సంచారం.. సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలోనే..

Digital Arrest Scam: విశ్రాంత ఉద్యోగికి డిజిటల్ అరెస్ట్ పేరిట వార్నింగ్.. జస్ట్ మిస్ లేదంటే..!

Harish Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై తప్పుడు లెక్కలు: హరీష్ రావు