RTC Bus Accident: పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!
RTC Bus Accident (imagecredit:twitter)
ఆదిలాబాద్

RTC Bus Accident: బస్సు రన్నింగ్‌లో ఫెయిల్ అయిన బ్రేకులు.. పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!

RTC Bus Accident: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలంలో గురువారం ఉదయం భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పరందోలి ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు(Brakes Fail) అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి బస్సును లోయలోకి పడిపోకుండా నియంత్రించి, పక్కనే ఉన్న పత్తి చేనులోకి మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఈ బస్సు పరందోలి నుండి మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ వైపు వెళ్తోంది. దాదాపు 200 మీటర్ల ఎత్తులో ఉండే పరందోలి ఘాట్ సెక్షన్ వద్దకు రాగానే బస్సు బ్రేకులు పని చేయకుండా పోయాయి.

Also Read: Collector Hanumantha Rao: మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు.. భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం!

రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి..

ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, బస్సు లోయలోకి దూసుకెళ్లకుండా చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి మళ్లించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలవ్వగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను వారు కృతజ్ఞతలతో అభినందించారు.

Also Read: Cyber Posters Launch: ఆన్ లై‌న్‌ అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి: ఎస్పీ డా. పి.శబరీష్

Just In

01

Digital Arrest Scam: విశ్రాంత ఉద్యోగికి డిజిటల్ అరెస్ట్ పేరిట వార్నింగ్.. జస్ట్ మిస్ లేదంటే..!

Harish Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై తప్పుడు లెక్కలు: హరీష్ రావు

The Paradise: ని ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి మరో అప్డేట్.. ‘బిర్యానీ’ పాత్రలో ఉన్న హీరో ఎవరంటే?

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ప్రధాని మోడీ ఫైర్.. కమల దళంలో కలకలం..!

Parliament News: తేనీటి విందులో అరుదైన దృశ్యం.. ప్రియాంక గాంధీ చెప్పింది విని స్మైల్ ఇచ్చిన ప్రధాని మోదీ, రాజ్‌‌నాథ్