ఆదిలాబాద్ బ్యూరో స్వేచ్ఛ: Bhatti Vikramarka: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విధ్వంసం చేసిన వ్యవస్థలను తాము బాగు చేస్తున్నామని సంపద సష్టించి ప్రజలకు పంచుతాం ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడిదారుల చేతుల్లోకి వెళ్లనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొద్దిమంది చేతుల్లోనే ఉన్న దేశ సంపద, వనరులు ప్రజలకు చెందాలని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తపిస్తున్నారని ఇందులో భాగంగానే భారత్ జోడో యాత్ర చేపట్టారని ఆయన సూచనల మేరకు ఎవరు అడ్డుపడినా సామాజిక పరివర్తనను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
డా.బీఆర్ అంబేడ్కర్ ఆలోచనల మేరకు అన్నివర్గాలకు సమానత్వం రావాలనే ఉద్దేశంతోనే జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్రంలో చేపట్టిన కుల దేశానికి రోల్ మాడల్ గా మారిందని బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మాణం చేశామని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఢిల్లీలోనూ ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర కేబినేట్ మొత్తం ఒకే మాట మీద ఉందని రాహుల్ గాంధీ మాటమీదని సంపదను పంచుతామని చెప్పారు. డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అరాచకాలు చేస్తున్నారు:
ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రేంసాగర్ రావు, వెడ్మ బొజ్జు, గిరిజన కార్పొరేషన్ ఛైర్మైన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకం చేసినట్లుగానే నేడు బీజేపీతో కలిసి రాజకీయ అరాచకం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీల పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరగని అభివద్ధి తాము ఒక్క ఏడాదిలోనే చేశామని చెప్పారు. తాను 2023 మార్చిలో పీపుల్స్ మార్ఛ్ పాదయాత్రను ఉమ్మడి జిల్లాలోనే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ జిల్లాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు రూ.1200 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు.
Also Read: Kancha Gachibowli Land: ఆ భూములపై ఫోకస్ పెంచిన ప్రభుత్వం.. నిపుణులతో చర్చలు..
రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కూల్స్ కోసం 25 ఎకరాల్లో రూ.250 కోట్ల చొప్పున రూ.11,600 కోట్లు కేటాయించామని, గిరిజనుల కోసం ఇందిర గిరిజల వికాసం కోసం రూ.12,500కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మహిళలకు రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 56వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం కోసం రూ.9వేల కోట్లు, పేదవర్గాలు 3.10కోట్లమందికి సన్నబియ్యం అందించేందుకు రూ.13,535కోట్లు, సన్నరకాలు పండించిన వారికి రూ.2675కోట్ల బోనస్ ఇచ్చామని, రూ.12,500 కోట్లు వ్యవసాయ పంపు సెట్ల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ రాయితీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. రైతాంగం కోసం రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, నీటి పారుదల కోసం రూ.23,273కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోయిందని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహిత నిర్మిస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాలలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి రాజ్యాంగాన్ని చులకనగా చేసి మాట్లాడారని తెలిపారు.
రాజ్యంగాన్ని అవమానించారు:
రాజ్యాంగాన్ని బలహీన పర్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రాష్ట్రంలో కుల గణన చేపట్టామని గుర్తు చేశారు. గత పదేళ్లలో జరగని అభివద్ధి ఏడాదిలోనే జరిగిందని రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఏం చేయగలమో చేసి చూపించామని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభతో పాటు ఉమ్మడి జిల్లాలో జరిగిన అన్ని సభలు విజయవంతమయ్యాయని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేశాయని గుర్తు చేశారు.
పార్టీలోకి మొన్న వచ్చిన వారు నా గొంతు నొక్కాలని చూస్తున్నారని నాకు అన్యాయం జరిగినా భరిస్తానని కానీ ఉమ్మడి జిల్లాకు మాత్రం అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. పార్టీలు తిరిగి వచ్చిన వారు మంత్రి పదవి కావాలంటున్నారని తెలిపారు. నా గొంతు కోస్తే ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు, దళితుల గొంతు కోసినట్లేనని వ్యాఖ్యానించారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/