Adivasi-JAC (Image source Twitter)
ఆదిలాబాద్, లేటెస్ట్ న్యూస్

Adivasi Protest: లంబాడీలకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

Adivasi Protest: చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ డిమాండ్

ఆదివాసి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన
ఆదివాసీల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

మహబూబాబాద్, స్వేచ్ఛ: రాజ్యాంగంలో చట్టబద్ధత లేని వలసవాదులైన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు (Adivasi Protest) డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాలోని ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో కుమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో ఆదివాసి జేఏసీ చేసిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివాసులు చేస్తున్న ర్యాలీకి పోలీసులు అడ్డు చెప్పడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న ఆదివాసి జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also- Gummadi Narsaiah: నిజాయితీకి మారుపేరైన ఈ ఎమ్మెల్యే బయోపిక్ చేయడానికి తెలుగులో హీరోలే లేరా?

రాస్తారోకోలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేయాలంటే ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి పొందాలని తెలిపారు. ఈ సమయంలో ఆదివాసి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు చేసిన అత్యుత్సాహానికి కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడీలు తమ హక్కులను కొల్లగొడుతున్నారని చెప్పారు. మాకు రావాల్సిన ఉద్యోగ నియామకాల్లో అత్యధికంగా లంబాడీలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లంబాడీలు బీసీ ఇతర వర్గాలకు చెందినవారుగా ఉన్నారని తెలంగాణలో మాత్రం వారికి ఎస్టీ జాబితాలో ఎందుకు చోటు కల్పించడం సరైనది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. జల్, జమీన్, జంగిల్ నినాదంతో ఆదివాసీలు అనాదిగా పోరాటం చేస్తూ ఉన్నారని ప్రస్తావించారు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఆదివాసీలకు సరైన న్యాయం జరగడం లేదని వెల్లడించారు. ఆదివాసీలను దెబ్బకొట్టేందుకే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరారని, వారిని ప్రభుత్వాలు తక్షణమే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆందోళన చేశారు.

Read Also- Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో అడ్వకేట్ దబ్బా సాయికుమార్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ, ఏ ఎస్ ఎఫ్ ప్రెసిడెంట్ బట్టు వెంకటేశ్వర్లు, ఏ ఎస్ యు జనరల్ సెక్రెటరీ సున్నం సతీష్, జేఏసీ సోషల్ మీడియా చైర్మన్ దబ్బకట్ల సుమన్, ఏ ఈ డబ్ల్యూ సి ఏ జిల్లా అధ్యక్షుడు వట్టం సాయిలు, కురుసం సీతారాములు, మానుకోట రాజకీయ నాయకులు యాప సీతయ్య, నాయక్ పోడ్ జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ కల్తీ సత్యనారాయణ, v మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల జేఏసీ బాధ్యతలు పాల్గొన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!