Indiramma Housing Scheme ( image credit: swetvha reporter)
ఆదిలాబాద్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో.. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తోంది?

Indiramma Housing Scheme: గూడులేని ప్రతి కుటుంబానికి నీడ కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు లబ్దిదారుల ఎంపిక, సర్వేల పేరుతో కొంత కాలయాపన చోటు చేసుకోగా .. తాజాగా ఇంటి నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మంజూరైన వాటిలో చాలా వరకు ఇంకా పునాది కూడా ప్రారంభం కావడం లేదు.

కొన్ని మండలాల్లో అసలే ప్రారంభం కాగాపోగా.. మిగితా వాటిలో పదిలోపు ఇళ్ల నిర్మాణాలు మాత్రమే మొదలయ్యాయి. కాగా బేస్ మెట్ పూర్తిచేసుకున్న లబ్దిదారులకు అధికారులు బిల్లులను ఖాతాల్లో జమ చేయడంతో వారిలో ఆనందం వ్యక్త మవుతోంది. బిల్లులు వస్తాయో రావోననే అపనమ్మకంతో ఉన్న వారిలో తాజాగా బిల్లుల మంజూరు ప్రక్రియ సంతోషాన్ని తీసుకొచ్చింది.

 Also Read: Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కుట్రపై తుది తీర్పు వచ్చేనా? 29న మరో కీలక రోజు!

మరోపక్క గ్రామాల్లోనూ రెండో విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఇందిరమ్మ కమిటీలకు అప్పగించడంతో అర్హులను గుర్తించగా వారు నిజమైన అర్హులా.. కాదా అనేది తేల్చందుకు సూపర్ చెకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరోపక్క ప్రభుత్వం తొలుత మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేస్తుండగా.. జిల్లాలో వాటి పనులు ప్రారంభమయ్యాయి. మావల మండల కేంద్రంలో ఇంటి నిర్మాణం పూర్తి కాగా ఇటీవల మంత్రి సీతక్క ప్రారంభించారు.

తొలి విడతలో 2148మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం తొలి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పట్టణ ప్రాంతం మినహాయించి మిగితా 17మండలాలకు గాను 2148 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 942 ఇళ్లకు ముగ్గు పోయగా.. కేవలం 76 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇందులో 51 ఇళ్లకు సంబంధించి బేస్ మెట్ పూర్తికావడంతో రూ.లక్ష చొప్పున బిల్లు మంజూరు చేశారు.

మరోపక్క మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణాలను ఇప్పటికే పూర్తిచేయాల్సి ఉండగా 8మండలాల్లో మాత్రమే స్లాబ్ లెవర్ పూర్తయినట్లు తెలుస్తోంది. మిగితా మండలాల్లో ప్రభుత్వ స్థలాలు లభించకపోవడం కారణంగా ఆలస్యం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలే వీటి నిర్మాణాలు కూడా ప్రారంభించామని చెబుతున్నారు. ఇలా తొలి విడత నిర్మాణాల్లో జాప్యం జరగడం మూలంగా మిగితా లబ్ధిదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

సర్వేలు, పారదర్శకత పేరుతో రెండో విడత ఎంపికలోనూ జాప్యం చోటుచేసుకోవడంతో తమకు ఇళ్లు ఎప్పుడు మంజూరవుతాయా..? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఇళ్లు రాకపోవడంతో లబ్దిదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి భరోసాతో ఉన్నారు. కానీ ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న ఆలస్యంతో లబ్దిదారుల్లో అసహానం వ్యక్తమవుతోంది.

 Also Read; Pakistan Man In Hyderabad: హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుడి వివాహం? అరెస్ట్ చేసిన పోలీసులు?

బిల్లుల కోసం తిరగాల్సిన పని లేదు

గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు బిల్లుల కోసం రోజుల తరబడి కార్యాలయం వెంట తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అవినీతి, అక్రమాలు సైతం చోటుచేసుకున్నాయనే అపవాదు ఉంది. తాజాగా ప్రభుత్వం ఇళ్ల కేటాయింపుతో పాటు బిల్లుల మంజూరు ప్రక్రియలోనూ పారదర్శకత పాటిస్తోంది. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేస్తోంది. ఇందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇంటికి సంబంధించిన బిల్లులను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేస్తోంది.

ఇళ్లు మంజూరు కాగానే పంచాయతీ కార్యదర్శి లబ్దిదారుల బ్యాంకు ఖాతాతో పాటు ఐఎఫ్ సీ కోడ్ సహా నమోదు చేస్తారు. తొలిసారి ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసిన వెంటనే ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తారు. బెస్మెట్ పూర్తికాగానే మరోసారి ఫోటో తీసి సంబంధిత సైట్లో నమోదు చేస్తారు. హౌసింగ్ ఏఈ లాగిన్ లోకి వెళ్లిపోగానే ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు(మెజర్ మెంట్) చేసి సైట్ లో అప్ లోడ్ చేస్తారు.

ఈ సమాచారం ఎంపీడీఓ, జడ్పీ సీఈఓ లాగిన్ లోకి వెళ్లిపోతుంది. వారు అనుమతించగానే లబ్దిదారుల ఖాతాల్లో రూ.లక్ష డబ్బులు జమ అవుతాయి. స్లాబ్ వరకు గోడలు నిర్మించగానే మరో రూ.లక్ష మంజూరుకాగా..స్లాబ్ పూర్తిచేసుకున్న తర్వాత రూ.2లక్షలు, నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష జమ చేయనుంది. మునుపటిలాగా అబ్ధిదారులు రోజుల తరబడి బిల్లుల కార్యాలయం, అధికారుల వెంట తిరిగే ప్రయాసాలు తప్పనున్నాయి.

Gram Panchayat Palana Book: తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై లోతైన విశ్లేషణ.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క!

రెండో విడత ఎంపిక కొలిక్కి..!
ప్రభుత్వం రెండో విడతలో నియోజకవర్గానికి 3500చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తోంది. వీటి కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఇందిరమ్మ కమిటీ లు దాదాపు పూర్తి చేశాయి. జనాభాను బట్టి గ్రామానికి 20నుంచి 30ఇళ్ల వరకు మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిలో అందరు అర్హులేనా కాదా తేల్చందుకు మండల స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన చేపడుతున్నారు. వీరు గుర్తించిన తరవాత జాబితాను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జి ల ద్వారా ఇంచార్జి మంత్రికి ఆమోదం కోసం పంపించునున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఇళ్ల నిర్మాణాలను మొదలు పెడుతామని అధికారులు చెబుతున్నారు.

నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాం…   షాకీర్, హౌసింగ్ డీఈ, ఆదిలాబాద్

ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే చాలా వాటి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిని త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. రెండో విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే నియోజకవర్గానికి 3500చొప్పున అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు మంజూరవుతాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు