Google Alert: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సారధ్యంలోని అమెరికా ప్రభుత్వం కొత్త ప్రవేశపెడుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ప్రభావిత వ్యక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు వస్తుండడంతో, విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్న అక్కడి కంపెనీలు సైతం వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ (Google) పలువురు కంపెనీ ఉద్యోగులకు కీలకమైన సూచన (Google Alert) చేసింది. అమెరికా వదిలి విదేశాలకు వెళ్లవద్దని, తిరిగి వచ్చేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే ముప్పు ఉందని హెచ్చరించింది. విదేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద తీవ్రమైన జాప్యం జరుగుతోందని, సుమారుగా మరో 12 నెలలపాటు ఈ పరిస్థితి ఉండవచ్చని ఉద్యోగులను అప్రమత్తం చేసింది. కాబట్టి, అమెరికా నుంచి విదేశాలకు వెళ్లి, తిరిగివచ్చేందుకు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని పేర్కొంది.
గూగుల్ కంపెనీకి లీగల్ అడ్వైజర్, న్యాయవాది మాట్లాడుతూ, కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం, ఉద్యోగులు ఎవరైనా తిరిగి అమెరికాలోకి ప్రవేశించాలంటే వీసాపై స్టాంపింగ్ వేయించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీసా స్టాంపింగ్ అపాయింట్‌మెంట్ల విషయంలో 12 నెలల వరకు జాప్యం జరిగే అవకాశం ఉందని, కాబట్టి, విదేశాలకు వెళ్లినవారు అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి, ఏడాదిపాటు అమెరికా నుంచి విదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించారు. ఈ మేరకు ప్రభావిత సిబ్బందిని గూగుల్ కంపెనీ హెచ్చరించింది. విదేశాలకు వెళ్లినప్పుడు పొరపాటున అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం ఉండిపోవాల్సి వస్తుందేమోనని అప్రమత్తం చేసింది.
Read Also- Narendra Modi: ల్యాండింగ్ సాధ్యపడక, వెనక్కి వెళ్లిపోయిన ప్రధాని మోదీ హెలికాప్టర్.. కారణం ఏంటంటే?
కాగా, హెచ్-1బీ వర్కర్లు, వారిపై ఆధారపడిన వారు, వివిధ వీసాలపై చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో అమెరికా రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా స్క్రీనింగ్ నిబంధనలను కఠినతరం చేశాయి. ఈ నిబంధన కారణంగానే స్టాంపింగ్‌కు తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వీసా క్లియరెన్స్‌లో జరుగుతున్న ఆలస్యాలను అమెరికా విదేశాంగ శాఖ కూడా అంగీకరించింది. దరఖాస్తుదారుల ఆన్‌లైన్ యాక్టివిటీని తాము సమీక్షిస్తున్నామని, అత్యవసరమైతే త్వరితగతిన పరిశీలన కోరుతూ కోసం అభ్యర్థించవచ్చని సూచించింది.
Read Also- Narendra Modi: ల్యాండింగ్ సాధ్యపడక, వెనక్కి వెళ్లిపోయిన ప్రధాని మోదీ హెలికాప్టర్.. కారణం ఏంటంటే?

