Civil Supplies Scam: వాట్సాప్‌లో స్కానర్ పెట్టి మరీ కమీషన్ల దందా..!
Civil Supplies Scam (imagecredit:swetcha)
రంగారెడ్డి

Civil Supplies Scam: వాట్సాప్‌లో స్కానర్ పెట్టిమరీ.. దర్జాగా కమీషన్ల దందా చేస్తున్న ఓ సివిల్ సప్లై అధికారి..?

Civil Supplies Scam: కమీషన్​ కావాలంటే ఫోన్​ పే చేయాలి
–రేషన్​ డీలర్లను అడుగుతున్న జిల్లా కార్యాలయం సిబ్బంది
–ఏసీబీకి పట్టుబడ్డా అధికారులు, సిబ్బందిలో బయం లేదు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రేషన్ డీలర్లకు రావలసిన కమీషన్ కోసం కూడా కొందరు ఎంతో కొంత మట్ట జెప్తే తప్ప కమీషన్ రాదేమో.. అనే పరిస్థితి రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖలో నెలకొంది. ఓ వ్యక్తి బాహాటంగా యూపిఐ స్కానర్ ను వాట్స్ అప్‌లో పెట్టడం సంచనం రేపింది. రేపు కలెక్టరేట్ లో మీటింగ్ ఉంది ఇంకా కొందరు అమౌంట్ కొట్టలేదు” అంటూ వాయిస్ మెసేజ్ పంపడం చర్చనీయాంశంగా మారింది. డీలర్లతో చర్చ నడుస్తోంది ఇటీవల కాలంలో ఓ డిటీ ఎసిబికి పట్టుబడ్డబటినప్పటికి ఇంకా సివిల్ సప్లైస్ అధికారులు తీరు మారలేదు అని డీలర్లు భావిస్తున్నారు.

రేషన్​ డీలర్ల సమావేశం

ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే బియ్యంపై రేషన్ డీలర్లకు కమీషన్​ ఇస్తుంది. ఆ కమీషన్​ కావాలంటే మాకు కూడా కమీషన్​ ఇవ్వాలని రంగారెడ్డి(Rangareddy) జిల్లా సీవిల్ సప్లయ్​ కార్యాలయంలోని సిబ్బంది బహిరంగంగా డిమాండ్​ చేస్తున్నారు. అయితే శనివారం రంగారెడ్డి కలెక్టరేట్​ కార్యాలయంలో రేషన్​ డీలర్ల సమావేశం ఉంది. ఆ సమావేశం లోపే ప్రభుత్వం ఇచ్చే కమీషన్​ కావాలి అనుకునే వాళ్లు తక్షణమే వాట్సప్​ గ్రూపు(WhatsApp group)లో పెట్టిన స్కానర్​ కు అమౌంట్​ పే చేయాలని మేసేజ్​లు పెట్టారు. అంతేకాకుండా రేషన్​ డీలర్లను చులకనగా చూస్తూ మాట్లాడిన ఆడియో బహీర్గతమైంది. ఇప్పుడు ఆ మేసేజ్​ జిల్లాలోని సోషల్​ మీడియా(social)లో చక్కర్ల కోడుతుంది.

Also Read: Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

డీలర్ల వాట్సప్​ గ్రూపులో మెసేజ్..

డీలర్లకు బిల్లులు చేసే ఉద్యోగి మండల యూనియన్​ నాయకులకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా మండల స్ధాయి డీలర్ల వాట్సప్​ గ్రూపులో కూడా మేసేజ్లు పెట్టి రేషన్​ షాపు నెంబర్లతో గుర్తు చేస్తున్నారు. కలెక్టరేట్​లోని సివిల్​ సప్లయ్​ విభాగంలో డీలర్ల కమీషన్​ చూసే ఉద్యోగి నిసిగ్గుగా కేంద్ర ప్రభుత్వం కమిషన్​ త్వరగా డబ్బులు పంపాలంటే తమకు మీరు పంపాలని తెలిపారు. అదేకాకుండా మెసేజ్​ చూసి నిద్రపోతున్నారా.. మత్తులో ఉన్నారా అంటూ పరుషపదజాలంతో మేసేజ్లు గ్రూపులో పెట్టారు. కోంత మంది చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు. మీరు డబ్బులు ఇవ్వోద్దు అనుకుంటే ఎందుకోసమే వివరణ ఇవ్వాలని కోరారు. మీ ఇష్టం మీకు కమీషన్​ రాదు నష్టపోతారు.

ఏసీబీ దాడులైతున్న భయం లేదు..

రంగారెడ్డి జిల్లాలో అధికారులు లంచాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఏసీబీ(ACB) దాడులు జరుగుతున్న భయం లేకుండా పోయింది. కాంగ్రెస్​(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ, టౌన్​ప్లానింగ్​, పంచాయతీ కార్యదర్శులు, ఇరిగేషన్​ ఇంజనీర్లు, ఏడీ సర్వేయర్లు, విద్యుత్​ శాఖలోని ఉద్యోగులతోపాటు సివిల్​ సప్లయ్​ అధికారులను సైతం ఏసీబీ ట్రాప్​ చేసి పట్టుకుంది. అయినప్పటికి అధికారులు లంచాలు అడగటం మానడం లేదని తెలుస్తోంది. రేషన్​ డీలర్లు విక్రయించే బియ్యం ఆధారంగానే కమీషన్లు ఇస్తారు. అలాంటి వారి వద్ద అధికారులు కమీషన్​ ఇవ్వాలని అడగటం ఆశ్చర్యంగా ఉంది. ఇదీ ఎక్కడికి దారితీస్తోందో వేచిచూడాల్సిందే. ఇలాంటి కమీషన్లు వసూళ్లు చేసే ఉద్యోగిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌ కెప్టెన్సీపై వేటుకు రంగం సిద్ధం?.. అదే చివరిది!

Just In

01

Niranjan Reddy: గ్రామ పంచాయతీ ఫలితాలు చూస్తుంటే.. మా సత్తా ఏంటో తెలుస్తుంది..?

ACB Raids: ఖమ్మం ఆర్టీవో ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఓ అధికారి దగ్గర భారీ నగదు స్వాదీనం..?

Sonia Gandhi: గాంధీ పేరు మార్పు.. తొలిసారి పెదవి విప్పిన సోనియా.. ప్రధానికి సూటి ప్రశ్నలు

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ జర్నీలో ఇమ్మానియేల్ ఫీలింగ్ ఏంటో తెలుసా.. కళ్యాణ్‌, తనూజల మధ్య ఉన్నది ఇదే?

Kotak Bank Downtime: కోటక్ ఖాతాదారులకు కీలక అలర్ట్.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పనిచేయవు.. ఎప్పుడంటే?