Kalwakurthy BRS: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నుంచి తప్పుకున్న నాయకుడు
–కార్యకర్తలను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే అంటూ ప్రచారం
–మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్సెస్ మాజీ కార్పారోరేషన్ చైర్మన్ ఉప్పల
–పంచాయతీ ఎన్నికల్లో చేతులెత్తేసిన మాజీ ఎమ్మెల్యేపై మరో వర్గం ఆరోపణలు
–మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉప్పల జోక్యం తగ్గించేందుకు మాజీ ఎమ్మెల్యే తంటాలు
–ఇద్దరి నేతల మధ్య పెరుగుతున్న మాటల యుద్దం
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రాన్ని శాసించే నేతలు సైతం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికి ఆ ప్రాంతం నుంచి పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సిందే. ఆ నియోజకవర్గమైన కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరని చెప్పవచ్చు. కల్వకర్తి నియోజకవర్గం ఏర్పాటైన నుంచి అత్యధిక సార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్. కానీ కొన్ని అనివార్య కారణాలతో తెలుగుదేశం పార్టీ(TDP) నుంచి అసెంబ్లీ బరిలో నిలబడిన గుర్కా జైపాల్ యాదవ్(Gurka Jaipal Yadav) రెండ్లు సార్లు గెలుపోందారు. తదనంతరం బీఆర్ఎస్లో పార్టీలో చేరి మరోసారి జైపాల్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిపోందారు. గెలిచిన ప్రతిసారి మరోపార్టీ పోత్తుతోనే గానీ స్వంతంత్ర పార్టీ గెలవలేదనే ప్రచారం ఉంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్ధిగా 2018లో పోటీ చేసినప్పుడు కన్నులొట్టపోయి బయటపడ్డారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి మద్దతుతోనే గెలుపుకు నాంది అని ప్రచారం ఉంది. తదనంతరం 2023 ఎన్నికల్లో జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి అడ్రస్ లేకుండా మూడో స్ధానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇలాంటి నేత కార్యకర్తల ఎదుగుదలను తట్టుకోలేరనే ప్రచారం జోరుగా సాగుతుంది. చివరి సారిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గ్రౌండ్ నుంచి పారిపోయాడే ఆరోపణలు అదే పార్టీలోని నేతలు వివరిస్తున్నారు. అలాంటి వ్యక్తి కార్యకర్తలకు అండగా ఉండటం లేదనే ఆవేధన నియోజకవర్గంలో వ్యక్తమైతుంది. నియోజకవర్గ స్ధాయిలోని మరో నేత ఉప్పల వెంకటేశ్ గుప్త పార్టీలో ఉన్నప్పటికి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
పార్టీ నష్టానికి మాజీ ఎమ్మెల్యే కారణం
కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీని నాశనం చేయడానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారణమంటూ మాజీ కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ గుప్త బహిర్గంగా ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయిన ఘనత ఆనయకే చెల్లుతుందని విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు దూరంగానే ఉన్నాడు… పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలకు అండంగా ఉండాల్సిన బాధ్యత ఎమ్మెల్యే స్ధాయి వ్యక్తులకు ఉంటుంది. ఎమ్మెల్యేగా బరిలో నిలిచినప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా అని ఉప్పల వెంకటేశ్ గుప్తా ప్రశ్నించారు. ప్రస్తుతం జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్ధానాలు గెలుపోందాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ జైపాల్ యాదవ్ ఎకపక్ష నిర్ణయాలతో అడుగులు వేస్తూ కాంగ్రెస్ పార్టీతో అంతర్గత సంబంధాలును కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు.
పార్టీ అధిష్టానం వద్దకైనా రేడీ..
బీఆర్ఎస్ పార్టీ బలహినపడేందుకు మాజీ ఎమ్మెల్యే వ్యవహారశైలియే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చాటాల్సిందే. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వల్లే అత్యధిక స్ధానాలు ఓటమి పాలైనట్లు సమాచారం. మాజీ కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ గుప్తను ఆశ్రయించిన సర్పంచ్ లు గెలుపునకు కృషి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తలకొండపల్లి మండలంలో అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గ్రామంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల మధ్య గట్టి పోటి నెలకొందని సమాచారం. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న ఉప్పల వెంకటేశ్ పై అధిష్టానానికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జైపాల్ యాదవ్ సూచించినట్లు ప్రచారం సాగుతుంది. పార్టీ అధిష్టానం వద్దే వర్గాల పంచాయతీ తెల్చుకుందామని ఉప్పల్ వెంకటేశ్ చాలెంజ్ చేస్తున్నారు.
మున్సిపాలిటీలపై ప్రభావం తప్పదు
బీఆర్ఎస్ పార్టీలో నడిచే వర్గపోరు మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తోందని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఎవరికి వారే ఎమునా తీరు అన్న చందంగా ఇరు వర్గాల నేతలు వ్యవహారిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలున్నాయి. కల్వకుర్తి, అమన్గల్ లో అధికార పార్టీయైన కాంగ్రెస్ పార్టీపైన విజయం సాధించడం అంతా సులభం కాదు. ఎందుకంటే వీరిద్దరూ ఒక్కటై పార్టీని బలోపేతం చేసేందుకు తంటాలు పడుతున్నప్పుడు వేరువేరుగా ఉంటూ గెలుపునకు కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. ఇద్దరి నేతల గోడవ ఏ స్ధాయికి చేరుతుందో వేచిచూడాల్సిందే.
Also Read: Illegal Construction: ఎల్లంపేటలో అక్రమ నిర్మాణంపై అధికారుల చర్యలు శూన్యం.. కారణం ఎంటో..?

