Medchal District: మున్సిపాలిటీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో అధికారులు నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ డబిల్పూర్లోని బైబిల్ కాలేజ్(Bible Collage)లో జరుగుతుందని కమిషనర్ స్వామి తెలిపారు. 24 వార్డులకు గాను 8 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, 8 నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మూడు చింతలపల్లి మున్సిపాలిటీ..
మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మూడు చింతలపల్లి ప్రభుత్వ పాఠశాల(Govt School)లో జరుగుతుందని కమిషనర్ పవన్ కుమార్ వెల్లడించారు.24 వార్డులకు గాను 8 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, 8 నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతుందని కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. 20 వార్డులకు గాను 7 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని, 7 నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్తో పాటు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కింది.
Also Read: CI Mahender Reddy: ప్రయాణాలు చేసే వారు.. ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.. సీఐ మహేందర్ రెడ్డి!
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: సీఐ సత్యనారాయణ
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పోటీ చేయదలచుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని మేడ్చల్ సీఐ సత్యనారాయణ(CI Sathyanarayana) సూచించారు. నామినేషన్ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని సీఐ చెప్పారు. నామినేషన్ దాఖలు సమయం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలని ఆయన కోరారు.
Also Read: Kothagudem CPI: కొత్తగూడెంలో కమ్యూనిస్టులకు హవా.. గెలుపు కోసం వ్యూహంతో దూసుకుపోతున్న నేతలు..?

