Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) శనివారం షెడ్యూల్‌లో (డిసెంబర్ 20) తీవ్రమైన అవాంతరం ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం, ఇవాళ ఉదయం 10.45 గంటలకు ఆయన పశ్చిమ బెంగాల్‌లోని నదియా పట్టణంలో బీజేపీ నిర్వహించతలపెట్టిన ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారమే మోదీ బయలుదేరి, ఢిల్లీ నుంచి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నదియా పట్టణానికి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లగా, ల్యాండింగ్ మాత్రం సాధ్యపడలేదు. దట్టమైన పొగమంచు ప్రభావంతో ఆ ప్రాంతంలో విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. హెలీప్యాడ్ పైనే హెలికాప్టర్ చాలాసేపు చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో, ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ల్యాండింగ్ అంత సురక్షితం కాదని భావించిన పైలెట్, హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించాడు. దీంతో, ప్రధాని మోదీ తిరిగి కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
Read Also- Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్
అనివార్య ఈ పరిస్థితి కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలాసేపు కోల్‌కతా విమానాశ్రయంలోనే వేచిచూడాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలిస్తే మరోసారి హెలికాప్టర్‌లో బయలుదేరాలని భావించారు. రోడ్డు మార్గాన వెళ్లే ప్రత్యామ్నాయాన్ని కూడా భద్రతా అధికారులు పరిశీలించారు. కార్యక్రమం జరగాల్సిన పట్టణం కోల్‌కతా నగరానికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో, అంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణించడం ఇబ్బంది అని భావిస్తే, ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించారు.
Read Also- Kavitha: సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాగా, పలు హైవే ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోదీ షెడ్యూల్ ఖరారైంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీ ‘పరివర్తన్ సంకల్ప సభ’లో పాల్గొనాల్సి ఉంది. బహిరంగ సభ ఏర్పాటు చేసిన తాహెర్‌పూర్ సభా ప్రాంగణానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సభా ప్రాంగణంలోకి ఇంకా జనాలు రాకుండా గేట్లను మూసివేశారు. 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి ఈ ర్యాలీతోనే శ్రీకారం చుట్టాలని బీజేపీ భావించింది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో మోదీ అక్కడికి చేరుకోలేకపోయారు.

