OnePlus Nord 6: ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ నుంచి మరో ఫోన్ లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. నార్డ్ సిరీస్ నుంచి ‘OnePlus Nord 6’ను విడుదల చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత త్రైమాసికం (జనవరి – మార్చి) చివరిలో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే లాంచ్ కు ముందే ‘OnePlus Nord 6’కు సంబంధించిన ఫీచర్లు లీకైనట్లు తెలుస్తోంది. అప్ కమింగ్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవేనంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్..!
గతేడాది విడుదలైన వన్ ప్లస్ నార్డ్ 5 మెుబైల్ కు అప్ గ్రేడ్ వెర్షన్ గా నార్డ్ 6 అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 చిప్సెట్ ప్రొసెసర్ తో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. Android 16 ఆధారిత ఆక్సిజన్ OS 16 తో పనిచేయనున్నట్లు సమాచారం. 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ ఈ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం.
బాహుబలి బ్యాటరీ..!
‘OnePlus Nord 6’ మెుబైల్ లో ఈసారి బ్యాటరీ హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఏకంగా 9000 mAh భారీ బ్యాటరీతో రాబోతున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనున్నట్లు సమాచారం. దీంతో పాటు నీరు, దుమ్ము -0 దూళి నుంచి రక్షణకు IP68, IP69, IP69K రేటింగ్లను కూడా నార్డ్ 6 మెుబైల్ కలిగి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
డ్యూయల్ రియర్ కెమెరా..!
‘OnePlus Nord 6’ ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు సమాచారం. ఫోన్ వెనుక భాగంలో 50 MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ లెన్స్ ఉండనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మెుబైల్ ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. నలుపు, నీలంతో తేలికైన మ్యాట్ ఫినిషింగ్ తో నార్డ్ 6 మెుబైల్ రావొచ్చని సమాచారం.
Also Read: Vivo X200T Mobile: మార్కెట్లోకి వచ్చేసిన.. మోస్ట్ వాంటెడ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!
ధర ఎంత ఉండొచ్చు!
టెక్ వర్గాల నివేదికల ప్రకారం ‘OnePlus Nord 6’ ఫోన్ మార్చి 1 -10 తేదీల మధ్య విడుదలయ్యే అవకాశముంది. ధర విషయానికి వస్తే.. దీనిని రూ.30,000 – రూ.35,000 మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. కాగా రానున్న రోజుల్లో ఈ ఫోన్ కు సంబంధించిన మరింత సమాచారం బయటకొచ్చే అవకాశముంది.

