Honor Robot Phone: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న హానర్ రోబోటిక్ ఫోన్ (Honour Robot Phone) విడుదలకు రంగం సిద్ధమైంది. బార్సిలోనాలో జరిగే మెుబైల్ వరల్డ్ కాంగ్రెస్ (Mobile World Congress – 2026) ఈవెంట్ ఈ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు హానర్ అధికారికంగా ప్రకటించింది. ‘హానర్ మ్యాజిక్ వీ6’ (Honour Magic V6)తో కలిపి ప్రపంచం ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా మెుబైల్ ప్రియుల దృష్టి హానర్ రోబోట్ ఫోన్ పైకి వెళ్లింది. ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటీ? ఏ రోజున ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది? వంటి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
మార్చి 1న లాంచ్..
హానర్ తన రోబోట్ ఫోన్ సమాచారాన్ని గతేడాది అక్టోబర్ లో తొలిసారి ఆవిష్కరించింది. ఈ మేరకు గతంలోనే వీడియోను విడుదల చేసింది. అందులో స్మార్ట్ ఫోన్ పై భాగంలో గింబాల్ తరహాలో రోబోటిక్ చేతితో కెమెరా ఉండటం చూసి అప్పట్లో పెద్ద ఎత్తున టెక్ లవర్లు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఈ రోబోట్ ఫోన్ పై బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఫోన్ లాంచ్ వివరాలను హానర్ ప్రకటించడంతో మారోమారు దీనిపై అందరి దృష్టి పడింది. హానర్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2026 మార్చి 1న బార్సిలోనాలో జరిగే ఎండబ్ల్యూసీ ఈవెంట్ లో ఈ రోబోట్ ఫోన్ లాంచ్ కానుంది.
What's the future of intelligent devices?
While the industry is busy comparing the iPhone, we believe it's time to break the mold and refocus on what truly matters: creating real value for you.
Introducing the HONOR ROBOT PHONE — a revolutionary AI device that fuses multi-modal… pic.twitter.com/NdhudoBpW0
— HONOR (@Honorglobal) October 15, 2025
రోబోట్ ఫోన్ ప్రత్యేకతలు
రోబోట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లను హానర్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే టెక్ వర్గాలు, హానర్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈ మెుబైల్ కెమెరా వ్యవస్థ హైలెట్ గా నిలవబోతోంది. అత్యంత ప్రత్యేకమైన ఏఐ ఆధారిత కెమెరా వ్యవస్థను ఈ మెుబైల్ లో అమర్చారు. హానర్ విడుదల చేసిన వీడియోను గమనిస్తే.. ఫోన్ వెనుక భాగంలో ఉండే ప్రైమరీ కెమెరా ఒక చిన్న రోబోటిక్ టూల్ లా పనిచేస్తోంది. కెమెరా ఆప్షన్ ఓపెన్ చేయగానే దానంతట అది బయటకు వచ్చి.. 360 డిగ్రీల కోణంలో రొటెట్ అవుతూ దృశ్యాలను చిత్రీకరిస్తుంది. యూజర్ ప్రమేయం లేకుండా ఏఐ వ్యవస్థ సాయంతో రోబోటిక్ చేయి దానంతట అదే రొటేట్ కావడం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
Also Read: Google Pixel Bug: గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ మాటలు సీక్రెట్‌గా వింటున్నారు!
హానర్ మ్యాజిక్ వీ 6 ఫీచర్లు
ఇక హానర్ మ్యాజిక్ వీ 6 ఫోన్ కు సంబంధించి కొన్ని ఫీచర్లు.. ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. టెక్ నిపుణుల ప్రకారం.. ఈ ఫోన్ ఫోల్డబుల్ Qualcomm’s 3nm Snapdragon 8 Elite Gen 5 ప్రొసెసర్ తో రానుంది. 200MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ను ఈ ఫోన్ కలిగి ఉండనున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. చైనాకు చెందిన ఓ టెక్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ ఫోన్ 2,320mAh, 4,680mAh సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలతో మార్కెట్ లోకి రాబోతోంది. అయితే గతంలో 7,150mAh, 7,200 mAh బ్యాటరీ సెటప్ తో ‘హానర్ మ్యాజిక్ వీ 6’ రాబోతున్నట్లు ప్రచారం జరగడం గమనార్హం. మెుత్తం మీద మార్చి 1వ తేదీన ఈ ఫోన్ తో పాటు రోబోట్ ఫోన్ ఫీచర్లపై కూడా క్లారిటీ రానుంది.

