Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్!
Realme Neo 8 Mobile
Technology News

Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవడం పక్కా!

Realme Neo 8 Mobile: చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ బ్రాండ్ రియల్‌మీ (Realme) నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. ‘Realme Neo 8’ పేరుతో చైనాలో రిలీజ్ అయిన ఈ అడ్వాన్స్డ్ ఫోన్.. మెుబైల్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులోని ఫీచర్లను చూసి టెక్ లవర్స్ ఫిదా అవుతున్నారు. భారత్ లో ఎప్పుడు విడుదలవుతుందా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ఫీచర్లు ఏంటీ? భారత్ లో ఎప్పుడు లాంచ్ కానుంది? ధర ఎంత ఉండొచ్చు? అన్న వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

గేమింగ్ ప్రియుల కోసం..

Realme Neo 8 మెుబైల్ ను గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 5 పవర్ ఫుల్ ప్రాసెసర్ ను అమర్చారు. 6.78 అంగుళాల Samsung M14 OLED స్క్రీన్, 1.5K రిజల్యూషన్, 6,500 నిట్‌ బ్రైట్ నెస్, 165Hz రిఫ్రెష్ రేట్, Realme UI వెర్షన్ 7.0 ఆధారిత Android 16 సాఫ్ట్ వేర్ వంటి అధునాతన ఫీచర్లను ఈ మెుబైల్ కలిగి ఉంది.

అతిపెద్ద బ్యాటరీ..

గేమ్స్ ఆడేవారిని ప్రధానంగా వెంటాడే సమస్యల్లో బ్యాటరీ డ్రై సమస్య ఒకటి. దీనిని Realme Neo 8 మెుబైల్ ద్వారా అధిగమించే ప్రయత్నం చేశారు. ఈ ఫోన్ ఏకంగా 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రూపొందింది. 80W ‘SuperVOOC’ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇది పనిచేయనుంది. గేమ్స్ ఆడుతున్న సమయంలోనే ఫోన్ ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఇందులో ప్రత్యేక ఫీచర్ ను అమర్చారు. దీని వల్ల ఫోన్ హీటింగ్ సమస్య ఉండదని రియల్ మీ వర్గాలు తెలిపాయి.

కెమెరా క్వాలిటీ..

Realme Neo 8 మెుబైల్ కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంగా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అలాగే 50MP పెరిస్కోప్ లెన్స్ (శామ్‌సంగ్ JN5) సైతం వెనుక భాగంలో ఫిక్స్ చేశారు. ఇది లాంగ్ షార్ట్ దృశ్యాలను ఫోన్ లో బంధిస్తుంది. గరిష్టంగా 120x వరకూ జూమ్ చేసి ఫొటోలు తీసుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోల కోసం 8MP సెన్సార్‌ను సైతం ఫోన్ కు అమర్చారు. ఇక ముందు భాగంలో సెల్ఫీ కోసం 16MP కెమెరాను ఫిక్స్ చేశారు.

భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదలైన Realme Neo 8 మెుబైల్ ను.. భారత్ లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్న దానిపై రియల్ మీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ ఫోన్ రిలీజయ్యే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ ఫోన్ ధరను చైనాలో 2,399 యువాన్లుగా నిర్ణయించారు. మూడు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని అందుబాలోకి తీసుకొచ్చారు.

Also Read: IND vs NZ 2nd T20I: నేడే కివీస్‌తో రెండో టీ-20.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. కీలక ప్లేయర్ ఔట్?

ధర ఎంతంటే?

Realme Neo 8 మెుబైల్ కు చైనాలో నిర్ణయించిన ధర ఆధారంగా.. భారత్ లో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేశాయి. వారి ప్రకారం 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 – 38,000, 16GB RAM + 512GB వేరియంట్ రూ.42,000 – 45,000. 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ రూ.49,000 – 52,000 ఉండొచ్చని అంచనా. భారత్ లో లాంచ్ అనంతరం Realme Neo 8 మెుబైల్ ధరలపై స్పష్టత రానుంది.

Also Read: Ananthagiri Hills: అనంతగిరిలో గ్లోబల్ ఐకానిక్ ప్రాజెక్టు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అభివృద్ధి ప్రణాళికలు ఇవే!

Just In

01

Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?

Govt School Neglected: భయపడి బడి మానేస్తున్న పిల్లలు!.. కలెక్టర్ గారూ కాస్త ఈ స్కూల్‌ను పట్టించుకోరూ!

Palnadu district Shocking: ప్రేయసి దూరం పెట్టిందని.. కోడికత్తితో ముక్కు కోసేశాడు.. వీడేంట్రా ఇలా ఉన్నాడు!

PM SVANidhi Credit Card: ‘పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్’ ఆవిష్కరించిన మోదీ.. అసలేంటీ కార్డ్?, ఎవరికి ఉపయోగం?, వివరాలివే

TPCC Chief: యావత్ ఫ్యామిలీ.. అలీ బాబా దొంగల బ్యాచ్.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ చురకలు