Vivo X200T Mobile: మార్కెట్‌లోకి వచ్చేసిన.. మోస్ట్ వాంటెడ్ ఫోన్!
Vivo X200T Launched in India
Technology News, లేటెస్ట్ న్యూస్

Vivo X200T Mobile: మార్కెట్‌లోకి వచ్చేసిన.. మోస్ట్ వాంటెడ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

Vivo X200T Mobile: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో (Vivo).. భారతీయ మార్కెట్ లోకి సరికొత్త ఫోన్ ను ఇవాళ (జనవరి 27) లాంచ్ చేసింది. ‘వివో ఎక్స్ 200టీ’ (Vivo X200T) మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ఈ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి వచ్చింది. తన ఫ్లాగ్ షిప్ ఫోన్ Vivo X200కు అనుసంధానంగా ఈ అడ్వాన్స్డ్ మెుబైల్ ను వివో భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో X200T మెుబైల్ కు సంబంధించిన ఫీచర్లు, కెమెరా క్వాలిటీ, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మెుబైల్ స్క్రీన్ అండ్ సాఫ్ట్‌వేర్..

Vivo X200T మెుబైల్.. 6.67 అంగుళాల AMOLED స్క్రీన్ ను కలిగి ఉంది. 1.5K రిజల్యూషన్‌తో 2800 x 1260 పిక్సెల్‌ తో ఫోన్ విడుదలైంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. Vivo X200T OriginOS తో వచ్చినట్లు వివో వర్గాలు పేర్కొన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ ద్వారా ఇది వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.

నాణ్యమైన కెమెరా సెటప్..

Vivo X200T ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరాగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP సోనీ LYTIA LYT-702 సెన్సార్‌ను అమర్చారు. అల్టా వైడ్ యాంగిల్ కోసం 50MP Samsung JN1 సెన్సార్.. పెరిస్కోప్ టెలి ఫోటో కోసం 50MP సోనీ LYT-600 సెన్సార్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక మెుబైల్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది.

స్టోరేజ్ అండ్ బ్యాటరీ సామర్థ్యం..

Vivo X200T మెుబైల్.. రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. 12GB RAM + 256GB ROM, 12GB RAM + 512GB స్టోరేజ్ సామర్థ్యాలతో మెుబైల్ ప్రియులకు ఈ ఫోన్ లభించే అవకాశముంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,200mAh బిగ్ బ్యాటరీని అమర్చినట్లు వివో వర్గాలు తెలిపాయి. దీనికి 90W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ ను అందించినట్లు తెలుస్తోంది.

కనెక్టివిటీ ఫీచర్లు..

Vivo X200T ఫోన్.. Wi-Fi 7, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేయనుంది. అలాగే నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పించే IP68, IP69 రేటింగ్ తో ఈ ఫోన్ రూపొందినట్లు తెలుస్తోంది. వీటికి తోడు ఐదేళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ను ఈ ఫోన్ ను కొనుగోలు చేయడం ద్వారా ఉచితంగా పొందవచ్చని వివో వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Medaram Jatara 2026: మేడారం వనదేవతల చెంత విదేశీల వీర నృత్యం.. సీతక్క చొరవతో అంతర్జాతీయ కళా వైభవం!

ధర ఎంతంటే?

స్టోరేజ్ సామర్థ్యం ఆధారంగా Vivo X200T ఫోన్ వేరియంట్లను నిర్ణయించారు. ప్రారంభ వేరియంట్ (12GB RAM + 256GB ROM) ధర రూ. 59,999 వరకూ ఉండొచ్చని సమాచారం. ప్రీమియం వేరియంట్ (12GB RAM – 512GB ROM) ధర రూ. 69,999గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు వివో షోరూంలలోనూ ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

Also Read: Tirumala Laddu Case: లడ్డు కల్తీపై తలతిక్క వాదన.. లాజిక్ మిస్ అవుతోన్న వైసీపీ.. ఎంత లాగితే అంత చేటు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?