MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్
Yusuff-Ali (Image source X)
Viral News, లేటెస్ట్ న్యూస్

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

MA Yusuff Ali: కాస్తో కూస్తో డబ్బు సంపాదిస్తే చాలు కొందరి వ్యవహార శైలి మారిపోతుంది. కాళ్లు నేల మీద నిలవనంతగా, దర్పణాన్ని ప్రదర్శిస్తుంటారు. సంపద పెరిగే కొద్దీ, వారి జీవన విధానం, ఖర్చులు, ప్రవర్తన అంతా ఆడంబరంగా కనిపిస్తుంది. కానీ, సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, కొందరు వ్యక్తులు మాత్రం తమ మూలాలను మర్చిపోకుండా, ఆదర్శప్రాయంగా ప్రవర్తింటారు. ఇండియన్ బిలియనీర్ ఎంఏ. యూసుఫ్ అలీ (MA Yusuff Ali) ఈ కోవకే చెందుతారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న లులూ మాల్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న ఆయన, దుబాయ్‌లో ఒక సాధారణ వ్యక్తిలా ప్రభుత్వ ప్రజా రవాణా బస్సులో ప్రయాణించారు. చాలా నిరాడంబరత, సామాన్య వ్యక్తిలా ఆయన పబ్లిక్ బస్సులో ప్రయాణించడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అందుకు, సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

బస్సెక్కిన బిలియనీర్ యూసుఫ్ అలీని డ్రైవర్ చాలా ఆప్యాయంగా పలకరించాడు. యూసఫ్ అలీ కూడా డ్రైవర్‌తో ఆప్యాయంగా కరచాలనం చేశారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటూ డ్రైవర్‌ను హిందీలో పలకరించారు. ఆ తర్వాత బస్సులోని ఇతర ప్యాసింజర్లతో కూడా సరదాగా మాట్లాడడం వైరల్‌ వీడియోలో కనిపించింది. ఈ వీడియో క్లిప్‌ను మొదట సజ్జాద్ ఫర్దేసే అనే యూజర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. దీంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పెద్ద సంఖ్యలో షేర్ చేస్తున్న నెటిజన్లు యూసఫ్ అలీని నిరాడంబరమైన వ్యక్తి అంటూ మెచ్చుకుంటున్నారు.

Read Also- Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

దుబాయ్ వైస్‌ ప్రెసిడెంట్ ప్రశంస

యూసుఫ్ అలీ పబ్లిక్ బస్సులో ప్రయాణించిన వీడియో వైరల్ కావడంతో, ఆ వీడియోను కొద్ది రోజులకే ఆసక్తికరమైన పరిణామం జరిగింది. దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాని, పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నుంచి ప్రశంస దక్కింది. ‘లెస్సన్స్ ఫ్రమ్ లైఫ్: పార్టీ 1’ అనే పుస్తకంపై స్వయంగా సంతకం చేసిన, ఒక కాపీని యూసుఫ్ అలీకి పంపించారు. ఈ విషయాన్ని అలీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. పుస్తకం ఫొటోను చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నుంచి పుస్తకం అందిందని పేర్కొన్నారు. ప్రధాని జీవితం నుంచి ప్రస్తుత, భవిష్యత్తు తరాలు ఎంతో నేర్చుకుంటాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఈ పుస్తకాన్ని అందుకునేందుకు తనను పరిగణనలోకి తీసుకోవడంతో కృతజ్ఞుతలు తెలియజేస్తున్నానని అన్నారు.

యూసఫ్ అలీ ఎవరు?

కాగా, యూసఫ్ అలీ లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లులూ హైపర్‌మార్కెట్ షాపింగ్ మాల్స్ ఈయనకు చెందినవే. యూసుఫ్ అలీ గల్ఫ్ దేశాలతో పాటు భారతదేశంలో మొత్తం 256 హైపర్‌మార్కెట్లు, మాల్స్ ఏర్పాటు చేశారు. భారీ రిటైల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం, ఆయన నికర ఆస్తి విలువ 5.9 బిలియన్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ దగ్గరదగ్గరగా రూ.53 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది.

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!