Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారేమోనన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. మెదక్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులున్నారన్న ఆయన.. వారివల్లే పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. కోవర్టు సిస్టం లేకపోతే అన్ని స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్ లుగా గెలిచి ఉండేవారని మైనంపల్లి పేర్కొన్నారు.
కోవర్డులు కాంగ్రెస్ పార్టీలో ఉండే బదులు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే తమ పార్టీ బాగుపడుతుందని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. పార్టీ సమావేశాల్లో ఏది జరిగినా పక్కకు వెళ్లి బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ‘మెదక్, సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఉద్యోగులు హరీష్ రావుకి సపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెట్ ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. దేశంలోనూ బ్యాలెట్ ఓటింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది’ అని మైనంపల్లి అన్నారు.
Also Read: West Bengal Sports Minister: మెస్సీ ఈవెంట్ ఎఫెక్ట్.. క్రీడల మంత్రి రాజీనామా.. ఆమోదించిన సీఎం
మరోవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నట్లు మైనంపల్లి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని గుర్తుచేశారు. మెదక్ జిలాల్లో 75 శాతం సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని బీఆర్ఎస్ కోవర్టులను వెంటనే గుర్తించి తొలగించాలని పార్టీ అధినాయకత్వానికి మైనంపల్లి హనుమంతరావు సూచించారు.
మెదక్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో BRS కోవర్టులున్నారు: మైనంపల్లి హనుమంతరావు
ఈ కోవర్టు సిస్టం లేకపోతే అన్ని స్థానాల్లో మేమే గెలిచేవాళ్ళం పార్టీ సమావేశాల్లో ఏది జరిగినా పక్కకు వెళ్లి BRS నేతలకు సమాచారం ఇస్తున్నారు.
బ్యాలెట్ ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన… pic.twitter.com/wqhrtV1K7y
— ChotaNews App (@ChotaNewsApp) December 16, 2025

