TTD Board Meeting: టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముంబయిలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు ఇలా పలు నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జరిగిన ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
❄️ టిటిడి ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం.
❄️ తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం.
❄️ టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం.
❄️ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.
❄️ భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు, ఆర్కిటిక్ట్ నియామకానికి ఆమోదం.
❄️ దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయం.
❄️ తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా రెండవ దశలో రూ.14.10 కోట్లు మంజూరు. (మొదటి దశలో ఇదివరకే రూ.4 కోట్లు మంజూరు)
❄️ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయం.
❄️ టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం.
❄️ తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని నిర్ణయం.
❄️ శ్రీవారి పోటులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోటు సూపర్‌వైజర్ (పాచక) పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.
❄️ తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డా. చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.డి.ప్రభాకర్ కృషమూర్తి సభ్యులుగా ఉండనున్నారు.
❄️ శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటు. నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం.
❄️ తిరుమలలోను, కాలిబాటలో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి, అనుభవం గల అధికారుల నియామకానికి ఆమోదం.
❄️ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డేస్కాలర్‌లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం.
❄️ జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణానికి నిర్ణయం.
Also Read: India Mexico Trade: టారిఫ్ పెంపులకు కౌంటర్‌గా మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు
❄️ టీటీడీ అనుబంధ ఆలయాలలో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో భాగంగా అర్చకులకు రూ.25,000/- నుండి రూ. 45,000లకు, పరిచారకులకు రూ.23,140 నుండి రూ.30,000/-లకు, పోటు వర్కర్లకు రూ.24,279 నుండి రూ.30,000లకు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు రూ.23,640 నుండి 30,000లకు జీతాలు పెంచడమైనది.
కాగా, ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు
తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపాం.
🔹 తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్
🔹 ముంబై బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం
🔹 ధ్వజస్తంభాలు, రథాల కోసం 100… pic.twitter.com/TewI0XfBOq— B R Naidu (@BollineniRNaidu) December 16, 2025

