Medak Heavy Rains: గత 2 రోజులుగా మెదక్,సంగారెడ్డి జిల్లాల్లో (Medak Heavy Rains) కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పోరులుతున్నాయి. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల (Heavy Rains)కు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.పలితంగా నీటి పారుదల శాఖ అధికారులు దిగువన మంజీర నదిలో కి 1 లక్ష 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.దీంతో మంజీర నది ఉగ్రరూపం దాల్చడంతో మెదక్ జిల్లా లోని ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జలదిగ్బంధం లో చిక్కుకుంది.దుర్గామాత అమ్మవారి పాదాలను తాకుతూ మంజీర నది ఉదృతంగా ప్రవహిస్తుంది.దీంతో మెదక్..ఎల్లాపూర్ బ్రిడ్జిపై పై నుంచి నీరు పారుతుంది.
Also Read: Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు
మత్స్యకారులు మంజరి నాది వైపు వెళ్ళకూడదు
దీంతో మెదక్ ఆర్ డి ఓ రమాదేవి,మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు లు సందర్శించి ముందు జాగ్రత్త చర్యగా బ్రిడ్జి పై నించి వాహనాల రాకపోకల ను నిలిపివేశారు.బ్రిడ్జి కి ఇరువైపుల బారి కేడ్ లను ఏర్పాటు చేసి పోలీసులను కాపలా ఉంచారు.రైతులు,ప్రజలు,ముఖ్యంగా గొర్ల కాపరులు, మత్స్యకారులు మంజరి నాది వైపు వెళ్ళకూడదని సూచించారు. ఏడుపాయల దర్శనానికి సైతం భక్తులు వర్షాలు తగ్గిన తర్వాత రావాలని మెదక్ ఆర్ డి ఓ రమాదేవి సూచించారు. సంగారెడి జిల్లా నారాయణఖేడ్ పిట్లం రాకపోకలు బంద్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ వద్ద వాగులు ఉదృతంగా ప్రవహించడంతో గ్రామాలకు లింకు తెగిపోయింది దీంతో ఆవల వైపున ఒడ్డున ఉన్న 40 మందిని సురక్షిత ప్రాంతాలకు బోటు సహాయంతో అధికారులు తరలిస్తున్నారు.
గ్రామాలకు రాకపోకలు బంద్
ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెవెన్యూ పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ప్రాజెక్టులు చెరువులు వాగులు వంకలు పూర్తిస్థాయిలో జలకలను సంతరించుకొని పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ఆయా గ్రామాలకు సంబంధించి వాగులు వంకలు,చెరువులు పొంగి, మత్తడి లు పొరడంతో రోడ్లు తెగిపోతున్నాయి.ఆయా గ్రామాల కు రాకపోకలు బంద్ అయ్యాయి.ముఖ్యంగా మెదక్,పెద్దశంకరంపేట, బుడమటిపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. రెవెన్యూ అధికారులు ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు.
Also Read: Pawan Kalyan: హైదరాబాద్‌లో అకస్మిక వరదలు.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఏమన్నారంటే?