Pawan Kalyan: హైదరాబాద్‌ అకస్మిక వరదలపై పవన్ స్పందన
Pawan Kalyan (Image Source: twitter)
హైదరాబాద్

Pawan Kalyan: హైదరాబాద్‌లో అకస్మిక వరదలు.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఏమన్నారంటే?

Pawan Kalyan: హైదరాబాద్ సహా ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం గుండా ప్రవహించే మూసీ నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఎంజీబీఎస్ లోపలకి వెళ్లే రెండు వంతెనల నుంచి మూసీ నది ప్రవహిస్తుండటంతో ప్రధాన బస్ స్టాండ్ నుంచి రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ నడుస్తుండటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నగర వాసులు, తెలంగాణలోని జనసైనికులకు కీలక సూచనలు చేశారు.

పవన్ ఏమన్నారంటే?

హైదరాబాద్ మూసీ వరదలపై పవన్ కళ్యాణ్ స్పందనను ఏపీ డిప్యూటీ సీఎ కార్యాలయం ఎక్స్ వేదికగా తెలియజేసింది. ‘హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదతో ఎం.జి. బస్టాండ్, పరిసరాలు నీట మునిగాయని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడమైనది’ అని పవన్ పేర్కొన్నారు.

చాదర్ ఘాట్ వద్ద ప్రమాదకరస్థాయిలో..

హైదరాబాద్ దాని పొరుగున ఉన్న జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండకుండలా మారాయి. దీంతో శుక్రవారమే అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసీలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగి.. నగరంలోని పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. ముఖ్యంగా చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. అలాగే గండిపేట నుంచి నాగోలు మధ్య గల మూసీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే మూసీ నదికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోని 1000 మందికి పైగా నిర్వాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read: CM Revanth Reddy: పర్యాటక రంగం అభివృద్ది పై ప్రభుత్వం ఫుల్ ఫోకస్!

ఎంజీబీఎస్ బస్టాండ్ క్లోజ్!

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ ప్రయాణికులను ఉద్దేశిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరిందని స్పష్టం చేశారు. దీంతో ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ న‌డుపుతోందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి.. వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్ప‌ల్ క్రాస్ రోడ్స్ నుంచి.. సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఎవరూ ఎంజీబీఎస్ బస్టాండ్ కు రావొద్దని టీజీ ఆర్టీసీ సూచించింది.

Also Read: KTR: మెట్రోకు ఎంత నష్టం? భూములు అమ్ముతారా?.. కేటీఆర్ ఫైర్!

Just In

01

GHMC: ఫిబ్రవరి 10 తర్వాత.. జీహెచ్ఎంసీ మూడు ముక్కలు

Allu Arjun: స్టాఫ్‌తో న్యూయర్ వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..

Nominated Posts: కొంచెం ఓపిక పట్టండి.. అందరికీ గుర్తింపు ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్ ఈ సారి పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడు.. బత్తాయిల అంతు చూస్తాడంట..

CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం: సీఎం రేవంత్